యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తు్న్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఆర్ఆర్ఆర్ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ సినిమాలో మరో స్టార్ హీరో రామ్ చరణ్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.ఇక ఈ సినిమా తరువాత తారక్ తన నెక్ట్స్ మూవీ ఎవరితో చేస్తాడా అని అందరి ఎదురుచూపులకు కొరటాల శివ రూపంలో యాన్సర్ దొరికింది.
ఎన్టీఆర్ కెరీర్లో 30వ చిత్రంగా రానున్న ఈ సినిమాను తొలుత త్రివిక్రమ్ తెరకెక్కిస్తాడని ప్రకటించినా, కొన్ని కారణాల వల్ల ఇప్పుడు కొరటాలతో ఫైనల్ చేశారు.ఇక ఈ సినిమా తరువాత మరో భారీ ప్రాజెక్టును తెరకెక్కించేందుకు తారక్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో తారక్ ఓ సినిమా చేయబోతున్నట్లు గతంలోనే వార్తలు వినిపించాయి.అయితే ఈ సినిమాలో తారక్‌తో పాటు తమిళ స్టార్ హీరో విజయ్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా కథను మాస్ ప్రేక్షకులకు అదిరిపోయే రేంజ్లో నచ్చుతుందని అట్లీ అంటున్నాడు.ఇక ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను అతి త్వరలో ప్రకటించేందుకు చిత్ర వర్గాలు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఏదేమైనా తారక్ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తే, ఆ కాంబినేషన్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అప్పుడే ప్రేక్షకుల్లో నెలకొంది.ఇక మాస్టర్ చిత్రంతో తెలుగులో కూడా అదిరిపోయే సక్సెస్ అందుకున్న విజయ్, తారక్‌తో కలిసి నటిస్తే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ కావడం ఖాయమని ప్రేక్షకులు అంటున్నారు.
మరి అట్లీ నిజంగానే తారక్ కోసం విజయ్ను దించుతాడా లేడా అనేది చూడాలి.