హీరోయిన్ గా కెరియర్ ప్రారంభించి తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ తీసుకొని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్.కోలీవుడ్ లో సర్కార్, పందెంకోడి సినిమాలలో విలన్ గా తనదైన పెర్ఫార్మెన్స్ తో అందరిని ఆకట్టుకుంది.
ఇక తరువాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి తెనాలి రామకృష్ణ సినిమాలో విలన్ గా మెప్పించింది.ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఆడకున్న తరువాత రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో అందరిని మెప్పించింది.
ఈ పాత్రకి మంచి గుర్తింపు రావడంతో పాటు సినిమా కూడా సూపర్ సక్సెస్ అయ్యింది.దీంతో ఈమెకి టాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తున్నాయి.
చిరంజీవి లూసీఫర్ సినిమాలో కూడా ఓ కీలక పాత్ర కోసం వరలక్ష్మిని తీసుకున్నారనే టాక్ వినిపిస్తుంది.అలాగే నాంది సినిమాలో ఈమె చేసిన లాయర్ పాత్రకి మంచి ప్రశంసలు లభించాయి.
ఇదిలా ఉంటే ఇప్పుడు క్రాక్ సినిమాలో తనకి జయమ్మ పాత్ర ఇచ్చిన గోపీచంద్ మలినేని వరలక్ష్మి కోసం మరో సారి అదిరిపోయే క్యారెక్టర్ డిజైన్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది.గోపీచంద్ మలినేని నెక్స్ట్ బాలకృష్ణతో యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.
ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం వరలక్ష్మిని సంప్రదించినట్లు తెలుస్తుంది.అది కూడా బాలకృష్ణతో సమానంగా ఉండే విలనీ పాత్ర అనే మాట వినిపిస్తుంది.నరసింహలో నీలాంబరి తరహాలో బాలయ్య సినిమాలో వరలక్ష్మి పాత్ర ఉంటుందని చెప్పుకుంటున్నారు.మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే దర్శకుడు గోపీచంద్ అధికారికంగా స్పందించే వరకు వేచి చూడాలి.