సాధారణంగా మనం నదుల్లో నీరు ప్రవహిస్తుండటం చూసి ఉంటాము కదా.ఎందుకంటే నదుల్లో నీరు మాత్రమే ప్రవహిస్తుంది.
అది సృష్టి దర్మం కూడా.కానీ ఆ ప్రాంతంలోని ఒక నదిలో మాత్రం నీటికి బదులుగా పాలు ప్రవహిస్తున్నాయి.
వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నాగాని ఇది మాత్రం నిజం అండి.అక్కడ నదిలో నీటికి బదులు పాలు ప్రవహించడం చూసి అక్కడ నివసిస్తున్న వారు అంత ఆశ్చర్యానికి గురి అవుతున్నారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఆ వీడియో చుసిన ప్రతి ఒక్కరు కూడా ఇదెలా సాధ్యం అని షాక్ అవుతున్నారు.
ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకుందామా.
ఈ సంఘటన యునైటెడ్ కింగ్డమ్ లోని వేల్స్ నగరంలో జరిగింది.
ప్రతిరోజు కూడా ఆ నదిలో ఎప్పటిలాగానే నీరు ప్రవహిస్తూ ఉండేదట.కానీ.
, ఉన్నటుండి ఒకరోజు అంటే ఏప్రిల్ 14వ తేదీన నీటికి బదులుగా ఆ నదిలో పాలు ప్రవహించడం మొదలుపెట్టాయట.అక్కడ ఉన్నా ఎవ్వరికి అర్ధం కాలేదు.
బహుశా మీకు కూడా అర్ధం అయి ఉండకపోవచ్చు ఉన్నటుండి నీళ్లు ఎలా పాలుగా మారాయని.? అయితే అలా నీళ్లు పాలుగా మారడానికి ఒక కారణం ఉంది అదేంటంటే.
ఆ నదికి సమీపంలో ప్రమాదవదత్తు ఒక పాల ట్యాంకర్ బోల్తా పడిపోయిందట.ఆ ట్యాంకర్ అలా బోల్తా పడడంతో ఆ ట్యాంకర్ లోని పాలు అన్ని నదిలోకి ప్రవహించడం మొదలుపెట్టాయి.
అలా పాలు నదిలోకి ప్రవహించడంతో నదిలోని నీరు అంతా తెల్లగా మారిపోయాయి.ఇది చుసిన జనం మొదట ఆశ్చర్యానికి గురి అయిన తరువాత అసలు నిజం తెలిసి అవాక్కయ్యారట.