నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నాడు.అన్ని అనుకున్నట్లుగా జరిగితే అఖండ సినిమా వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.
కాని కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా ను వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే.
సింహా మరియు లెజెండ్ సినిమాలతో సూపర్ హిట్ ను దక్కించుకున్న ఈ కాంబో హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అంటూ నందమూరి అభిమానులు నమ్మకంగా ఉన్నారు.అయితే కొందరు అభిమానులు మాత్రం ఈ సినిమా పై కాస్త అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఆ అనుమానాలకు కారణాలు కూడా వారు చెబుతున్నారు.
బాలకృష్ణ హీరోగా రూపొందిన గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి.
దానికి తోడు బోయపాటి గత చిత్రం వినయ విధేయ రామ సినిమా తీవ్రంగా నిరాశ పర్చింది.ఆ సినిమా లోని యాక్షన్ సన్నివేశాలు మరీ ఎక్కువ గా ఉన్నాయంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఆ ట్రోల్స్ మర్చి పోయాడేమో కాని బోయపాటి మళ్లీ ఈ సినిమా లో కూడా యాక్షన్ సన్నివేశాలను అలాగే చేస్తున్నాడేమో చూపించబోతున్నాడేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ప్రస్తుతం బాలకృష్ణ పై చివరి దశ చిత్రీకరణ చేస్తున్నారు.
అఘోర గెటప్ లో బాలయ్య కనిపించబోవడం లేదు అంటూ చెప్పిన బోయపాటి చివరకు టీజర్ లో అదే లుక్ ను విడుదల చేయడం జరిగింది.టీజర్ లో పర్వాలేదు అన్నట్లుగా ఉంది కాని సినిమాలో ఎలా ఉంటుందో అనే ఆందోళన వ్యక్తం అవుతుంది.
సినిమాలో ఆ పాత్రతో బోయపాటి చెప్పించే డైలాగ్స్ సినిమా పై చాలా ప్రభావం ఉంటుంది.కనుక బోయపాటి ఈసారి బాలయ్యకు దెబ్బేయడు కదా అంటూ అభిమానులు ఒకింత అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కొందరు అభిమానులు మాత్రం అఖండ సినిమాపై అంతులేని అంచనాలు పెట్టుకుని ఉన్నారు.