కరోనా కాటుకు తెలంగాణలో మరో ప్రాణం బలి అయ్యింది.అడిక్‌మెట్ డివిజన్ కార్పొరేటర్ సునీత గౌడ్ భర్త, బీజేపీ సీనియర్ నాయకులు అయిన ప్రకాష్ గౌడ్ ఈరోజు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.
ఇకపోతే రెండు రోజుల క్రితం కార్పొరేటర్ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్నప్రకాష్ గౌడ్ అదే రోజు సాయంత్రం అస్వస్థతకు గురవగా వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారట.అతని ఆరోగ్యం పై అనుమానం కలిగిన వైద్యులు పరీక్షలు చేయగా అందులో కరోనా పాజిటివ్ అని తేలిందట.
దీంతో హైటెన్షన్‌కు గురైన ప్రకాష్ గౌడ్‌ను ఐసీయయూకి తరలించారు.ఈ క్రమంలో అక్కడ చికిత్స పొందుతు శనివారం తెల్లవారుజామున మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు.కాగా ఆయన ఆకస్మిక మరణం నియోజక వర్గం ప్రజలను, పలు పార్టీల నాయకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
ఇదిలా ఉండగా మరణించిన ప్రకాష్ గౌడ్ మృతదేహన్ని రామ్ నగర్ లోని ఆయన నివాసానికి తీసుకువచ్చిన అనంతరం పార్శిగుట్ట స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించినట్లుగా సమాచారం.
ఇకపోతే ఈ మరణ వార్త తెలుసుకున్న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ తో పాటుగా పలు పార్టీల నాయకులు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.