రష్మిక మందన్న టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకుపోతున్నారు.ఛలో సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యి మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది.
ఆ తర్వాత వచ్చిన గీత గోవిందం సినిమాతో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది.తెలుగులో ఈమె చేసిన సినిమాలన్నీ హిట్ టాక్ తెచ్చుకోవడంతో గోల్డెన్ లేడీగా ముద్ర పడింది.
ఈ రోజు రష్మిక మందన్న తన పుట్టిన రోజును జరుపుకుంటుంది.ఈ సందర్భంగా రష్మిక నటిస్తున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు‘ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.
ఈ సినిమాలో శర్వానంద్ రష్మిక జంటగా నటిస్తున్నారు.కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ పోస్టర్ లో రష్మిక చాలా అందంగా కనిపిస్తుంది.తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
పసుపు రంగు చీర పువ్వులను మాల కడుతున్న లుక్ ను సినిమా విడుదల చేసింది.చూపరులకు కన్నుల పండుగగా ఈ లుక్ ఉంది.ఈ సినిమాను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ భామ చేతిలో పుష్ప సినిమాతోపాటు.
బాలీవుడ్ సినిమా మిషన్ మజ్ను ఉన్నాయి.అలాగే అఖిల్, సురేందర్ రెడ్డి చేస్తున్న సినిమాలో కూడా ఈ బ్యూటీ నే హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం.
పుష్ప సినిమా షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది.ఈ సినిమా ఆగస్టు 13 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన నటిస్తుంది.సుకుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతుంది.ఈ మధ్యనే రష్మిక కార్తీ కలిసి నటించిన ‘సుల్తాన్’ సినిమా విడుదల అయ్యింది.ఇలా చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతూనే ఏమాత్రం మిస్ అవ్వకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.