రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది అన్న సంగతి తెలిసిందే.తెలంగాణలో అయితే మళ్లీ పుంజుకునే అవకాశం లేదు అన్నా టాక్ వినపడుతోంది.
ఇదే పరిస్థితి ప్రస్తుతం ఏపీలో కూడా రావచ్చు అన్న వార్తలు ఇటీవల స్టార్ట్ అయ్యాయి.ఇలాంటి తరుణంలో టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం రావాలంటే కచ్చితంగా నాయకత్వం మారాలని, జూనియర్ ఎన్టీఆర్ వస్తే మళ్లీ గాడిలో పడుతుందని చాలామంది చెబుతున్నారు.
చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో ఇటీవల ఎన్నికల ప్రచారం నిర్వహించిన క్రమంలో కూడా చాలామంది జూనియర్ ఎన్టీఆర్ ని పార్టీ లోకి తీసుకురావాలి అని కార్యకర్తలు కోరారు.
పరిస్థితి ఇలా ఉండగా తాజాగా టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా జూనియర్ ఎన్టీఆర్ పై సంచలన కామెంట్ చేశారు.
సోమవారం టీడీపీ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.తెలుగుదేశం పార్టీ స్థాపించి నలభై సంవత్సరాలలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కోవటం జరిగిందని తెలిపారు.
ప్రస్తుతం వైసిపి.దమనకాండను ఎదుర్కొంటుందని అన్నారు.
కిందిస్థాయి వాస్తవాల ప్రకారం తెలుగుదేశం పార్టీలో కొత్త నాయకత్వం రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు పలువురు పార్టీ కోసం పని చేయాలని సూచించారు.