ఇప్పటికే బీజేపీ తో దూరం దూరం గా జరుగుతున్నట్లు గా వ్యవహరిస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రసన్నం చేసుకునేందుకు ఆ పార్టీ నేతలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.తిరుపతి నుంచి జనసేన, బీజేపీ తరఫున బీజేపీ అభ్యర్థి గా రత్నప్రభ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
ఇప్పటికే దీనికి పవన్ మద్దతు ఇస్తున్నారు.పవన్ ఎన్నికల ప్రచారంలో కి రావడం అనుమానంగానే మారింది.
ఈ పరిస్థితుల్లో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ తిరుపతి సీటులో గెలవకపోతే ఏపీలో బీజేపీ పరిస్థితిమరింత దారుణంగా తయారవుతుందని, ఎప్పటికీ ఇక్కడ కొలుకొలేమని భావిస్తున్న బీజేపీ అధిష్టానం పెద్దలు మెగాస్టార్ చిరంజీవిని ఎన్నికల ప్రచారానికి దింపాలి అనే ఆలోచనలో ఉన్నారట.ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు సైతం చిరంజీవికి ఫోన్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఆ ఫోన్ కాల్ కనుక నిజం అయితే, చిరంజీవి బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారానికి వస్తారా అనేది అనుమానమే.
ఎందుకంటే తన సొంత తమ్ముడు జనసేన పార్టీని స్థాపించినా, ఇప్పటి వరకు బహిరంగంగా చిరంజీవి మద్దతు పలకలేదు.
అలాగే ఎన్నికల ప్రచారానికి దిగలేదు.అది కాకుండా ఏపీలో వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ తో చిరంజీవి సన్నిహితంగా మెలుగుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
రెండు రోజుల క్రితం కర్నూలు ఎయిర్ పోర్ట్ కు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును పెడుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పైన చిరంజీవి జగన్ ను అభినందిస్తూ ట్వీట్ చేశారు.కానీ ఇప్పుడు బీజేపీ ఒత్తిడి తో చిరు ప్రచారానికి దిగుతారా ? దిగితే రాజకీయ సమీకరణాలు ఏ విధంగా ఉంటాయి అనే దానిపైన అప్పుడే లెక్కలు మొదలయ్యాయి.అయితే ఏదో రకంగా చిరంజీవిని ఎన్నికల ప్రచారానికి ఒప్పించాలని , అలాగే పార్టీలో చేర్చుకునే విషయంపైన దృష్టి పెట్టాలని, అవసరమైతే చిరంజీవి స్థాయికి తగ్గ నామినేటెడ్ పదవిని ఇవ్వాలని బీజేపీ చూస్తోందట.

అది కాకుండా గతంలో తిరుపతి నుంచి ఎమ్మెల్యేగా చిరంజీవి గెలవడం ఆ సామాజికవర్గం ఓటర్లు తిరుపతిలో ఎక్కువగా ఉండటం, ఇవన్నీ తమకు కలిసి వస్తాయని కమలనాధులు ఆలోచనలో ఉన్నారట అందుకే ఇక్కడ గెలిచేందుకు దొరికిన ఏ చిన్న అవకాశాన్ని చేజారి పోకుండా చూసుకుంటూ, ఈ ఉప ఎన్నికలలో గట్టెక్కేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.