మెగాస్టార్ మాస్టర్ సినిమాలో పెద్ద తప్పు.. ఇన్నేళ్లకు బయటకు?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎంతో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా,నటన పై ఉన్న ఆసక్తి ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

 Chiranjeevi, Cinema, Big Mistake, Tollywood, Mastere Movie, Acharya, Khaidi No.1-TeluguStop.com

అయితే ముందుగా చిరంజీవి కే.బాలచందర్ దర్శకత్వంలో కమల్ హాసన్, జయసుధ జంటగా నటించిన ఇది కథ కాదు సినిమాలో విలన్ పాత్ర ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.ఈ సినిమా 1979లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆ విధంగా విలన్ పాత్ర ద్వారా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన చిరంజీవి నటనను చూసిన కొందరు దర్శకులు అతనికి హీరోగా నటించే అవకాశం కల్పించారు.

1979 లో చిరంజీవికి పునాదిరాళ్లు అనే సినిమాలో హీరోగా నటించే అవకాశం దక్కింది.అయితే ఈ సినిమా కన్నా ముందుగా చిరంజీవి నటించిన ప్రాణం ఖరీదు విడుదల అయ్యింది.

ప్రాణం ఖరీదు సినిమా మంచి విజయం సాధించడంతో మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వెల్లువెత్తాయి.ఈ క్రమంలోనే ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించడమే కాకుండా, పలు నంది అవార్డులను సైతం దక్కించుకున్నారు.

గ్యాంగ్ లీడర్ ,ముఠామేస్త్రీ, హిట్లర్, ఇంద్ర, మాస్టర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించారు.

చిరంజీవి 1997 లో నటించిన మాస్టర్ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి మనకు తెలిసినదే.

మాస్టర్ సినిమాను సురేష్ క్రిస్నా దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.ఈ సినిమాలో చిరంజీవికి, రోషిని, సాక్షి శివానంద్, పునీత్ ఇస్సార్ ప్రధాన పాత్రలలో నటించారు.

చిరంజీవి తన సినీ కెరీర్లో మొట్ట మొదటిసారిగా మాస్టర్ సినిమాలో ఓ పాటను పాడారు.ఎంతో అద్భుతంగా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 3 1997 ఈ సంవత్సరంలో విడుదలైంది.

అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది.అదేవిధంగా తెలుగు చిత్ర పరిశ్రమలో డిటిఎస్ రికార్డు చేసిన మొదటి సినిమా మాస్టర్ అని చెప్పవచ్చు.

Telugu Big, Chiranjeevi, Tollywood-Movie

బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించిన ఈ సినిమాలో ఒక పెద్ద తప్పు జరిగింది.అప్పట్లో ఇలాంటి పొరపాట్లను గుర్తించలేక పోయినప్పటికీ ప్రస్తుతం ఈ సినిమాలో జరిగిన ఆ తప్పును గుర్తించడంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సినిమా లో జరిగిన ఆ పెద్ద తప్పు ఏమిటంటే ఈ సినిమాలో విజయ్ కుమార్ కాలేజ్ ప్రిన్సిపల్ గా జనార్దన్ రావు పాత్రలో నటించారు.ఈయన కూతురు పాత్రలో రోషిని ప్రీతి గా నటించారు.

అయితే తాను ప్రేమిస్తుంది గురువు గారి కూతురు అని తెలియని చిరంజీవి ఏకంగా తనను తీసుకెళ్లి ప్రేమిస్తున్నానని జనార్దన్ రావుతో చెబుతాడు.అందుకు జనార్దన్ రావు మరి అమ్మాయి తండ్రికి తెలుసా అని అడుగుతాడు అప్పుడు చిరంజీవి ఏంటి చెప్పేది గాడిదగుడ్డు ఆడపిల్లల తండ్రులు ఫూల్స్, ఇడియట్స్ అంటూ తిడుతూ పైకి చూస్తాడు.

అక్కడ జనార్దన్ రావుతో ప్రీతి కలిసి దిగిన ఫోటోలు కనిపిస్తాయి.ఆ ఫోటోలను చూసిన చిరంజీవి ఒక్కసారిగా షాక్ అవుతారు.అయితే మాస్టర్, ప్రీతి తండ్రి కూతుర్లని తెలియడంతో ఎంతో కంగారు అతని కాళ్ళ పై పడతారు.ఇక్కడ ఉన్న ఫోటోలను ఒక్కసారి గమనిస్తే ఆ తప్పు ఏంటో మనకు తెలిసిపోతుంది.

Telugu Big, Chiranjeevi, Tollywood-Movie

ఆ ఫోటోలలో రోషిని (ప్రీతి) తన తండ్రి కొంచెం వయసులో ఉన్నప్పుడు ఒకటి ఉండగా, తరువాత ఒక ఫోటోలో కొంచెం వయస్సు అయినట్టు జనార్దన్ రావు మనకు కనిపిస్తారు.అయితే ఈ రెండు ఫోటోలలో జనార్దన్ రావు వయసు తేడాతో కనిపించినప్పటికీ, రోషిని మాత్రం ఒకే డ్రస్ లో కనిపిస్తారు.ఈ లెక్కన చూస్తే ఈ రెండు ఫోటోలు ఒకే రోజు షూట్ చేసినవని అర్థమవుతుంది.ప్రస్తుతం మాస్టర్ సినిమా చూస్తే ఈ పెద్ద తప్పును మనం ఈజీగా కనుక్కోవచ్చు.

మాస్టర్ సినిమాలో ఉన్న ఈ తప్పు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Telugu Big, Chiranjeevi, Tollywood-Movie

ఇక మెగాస్టార్ చిరంజీవి కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాలలోకి వెళ్లారు.తర్వాత రాజకీయాల నుంచి తప్పుకొని సినిమాలలో తన రెండవ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తూ ఖైదీ నెంబర్ 150 సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ సినిమాలో చిరంజీవితో పాటు తన కొడుకు రామ్ చరణ్ తేజ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించడం గమనార్హం.

ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube