వైరల్: సంవత్సరమున్నర మగ బిడ్డ కడుపులో పెరిగిన పిండం.. చివరకు..?!

మహారాష్ట్ర పూణేలోని పంప్రి ఆస్పత్రిలో ఒక విచిత్రమైన కేసు నమోదయింది.ఈ విచిత్రమైన కేసును ఆ ఆసుపత్రిలోని డాక్టర్లు ఒక ఛాలెంజ్ గా తీసుకుని విజయవంతంగా ముగించారు.

 Viral: A Fetus That Has Grown In The Womb Of A One And A Half Year Old Male Chil-TeluguStop.com

అభం శుభం తెలియని ఓ18 నెలలు నిండిన బాలుని కడుపులో పెరుగుతున్న ఇంకొక ప్రాణి పెరిగింది.ఆ బాలుని కడుపులో నుంచి అర కిలో బరువు ఉన్న చనిపోయిన పిండాన్ని బయటికి తీసి ఆపరేషన్ సక్సెస్ చేశారు వైద్యులు.

ప్రస్తుతము ఆ బాలుడి ఆరోగ్యం కొద్దిగా ఉంది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే నేపాలి సంతతికి చెందిన ఓ మహిళ 18 నెలల క్రితం ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది.

అయితే శిశువు జన్మించిన తరువాత ఆ బాలునికి కొన్ని ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి.ఆ బాలుడు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డటం ఆ తల్లిదండ్రులు గమనించారు.కొన్ని రోజుల తర్వాత ఆ బాలుని కడుపు అచ్చం గర్భవతి లాగా పెరుగుతూ ఉండడం గమనించారు.దీనితో బాలుని యొక్క పరిస్థితి రోజురోజుకు ప్రాణాంతకంగా మారుతుండడంతో అప్పుడు తల్లిదండ్రులు ఆ పసి పిల్లాడిని పూణేలోనే హాస్పిటల్ కు తీసుకెళ్లగా అక్కడ డాక్టర్లు అన్ని పరీక్షలు జరిపి షాక్ అయ్యారు.

ఆ శిశువుకు జన్మనిచ్చిన తల్లికి రెండు పిండాలు ఉన్నాయి.పిండాలలో ఒకటి మరొక పిండము లోకి వెళ్ళినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది అని అక్కడి డాక్టర్లు తెలుసుకున్నారు.

పిండము శిశువు కాలేయము, కుడి మూత్రాశయము మధ్యలో ఉన్నట్లు తెలుసుకున్నారు.పిండము చనిపోయినట్లు కూడా నిర్ధారణ చేసుకున్నారు.

పెద్ద రక్తనాళాలు, కాలేయము ఇలా కొన్ని అవయవాలు ప్రేగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మొత్తము కణితిని తొలగించి ఆపరేషన్ సక్సెస్ చేశారు
.

ఈ సర్జరీలో పీడియాట్రిక్ సర్జరీ విభాగము డాక్టర్ ప్రణబ్ జాదవ్ అతని బృందము సుమారు ఆరు గంటల పాటు ఆపరేషన్ చేసి తిరిగి బాలునికి ప్రాణం పోశారు.

అయితే తొలగించబడిన పిండానికి అప్పుడే కాళ్ళు, చర్మము, జుట్టు, అవయవాలు ఏర్పడినట్లు డాక్టర్లు తెలియజేశారు.ఇలాంటి కేసులు 5 లక్షల మంది పిల్లలలో ఒకరు ఇలాంటి అరుదైన కేసులు వస్తాయి అని డాక్టర్లు తెలియజేశారు.దీనినే వైద్య పరిభాషలో ఫిటస్ ఇన్ పెటు అంటారని వైద్యులు తెలియజేశారు.కా18 నెలల బాలుని కడుపులో ఇలాంటి విచిత్రమైన అండము పెరుగుతుండడం చాలా అరుదైన విషయం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube