టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ వరుస ఆఫర్ లను సొంతం చేసుకుంటున్నాడు.ఇదిలా ఉంటే ఫిబ్రవరి 26న విడుదలైన సినిమా చెక్.
చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదల కాగా నితిన్ అనుకున్నంత సక్సెస్ రాలేకపోయింది.గత ఏడాది భీష్మ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నితిన్ కు వరుస ఆఫర్లు రాగా ఈ సినిమా అంతగా క్రేజ్ ఇవ్వలేకపోయింది.
నితిన్ నటించిన మరో రెండు సినిమాలు కూడా గత ఏడాది విడుదలయ్యేవి.కానీ కరోనా సమయం కాబట్టి ఆ సినిమాలను వాయిదా వేశారు.ఇక భీష్మ తో వచ్చిన విజయం చెక్ సినిమా తో కంటిన్యూ చేద్దాం అనుకున్న నితిన్ ఈ సినిమా నుండి కాస్త నిరుత్సాహ పడగా ప్రస్తుతం రంగ్ దే సినిమాపై నమ్మకాన్ని పెట్టుకున్నాడు.ఇదిలా ఉంటే రంగ్ దే సినిమా సక్సెస్ ప్రభావం మాత్రం ఆ తర్వాత సినిమాలపై పడనుందని తెలుపుతున్నాడు.

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా రంగ్ దే. ఈ సినిమాలో మహానటి ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.ఇక మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు.ఈ సినిమా నుండి కొన్ని లిరికల్ సాంగ్స్ విడుదల కాగా అభిమానుల నుండి మంచి ప్రశంసలు వచ్చాయి.
ఇక ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా ఈ సినిమా నితిన్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో మార్చి 26 వరకు ఆగాల్సిందే.అంతేకాకుండా నితిన్ నటించిన మరో సినిమా బాలీవుడ్ లో మంచి విజయం అందుకున్న అంధాదున్ సినిమా తెలుగు రీమేక్ లో నటించాడు.
ఇదే కాకుండా మరో సినిమా పవర్ పేట లో కూడా నటించగా అవి కూడా ఈ ఏడాదే విడుదల కానుందని వార్తలు వినిపిస్తున్నాయి.