కస్టమర్లకు అలర్ట్.. ఆ బ్యాంకుల చెక్‌ లు ఏప్రిల్ 1వ తేదీ తర్వాత పనిచేయవట. ఎందుకంటే.. ?

ఈ మధ్య కాలంలో ఆంధ్రా బ్యాంకు కస్టమర్లకు ఈ బ్యాంక్ లావాదేవీల విషయంలో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.ఎందుకంటే యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకు విలీనం అవుతున్న క్రమంలో ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

 Andhra Bank And Corporation Bank Cheques Will Not Valid After April 1st , Andhra-TeluguStop.com

ఇప్పటికే ఈ సమాచారాన్ని బ్యాంకు ఆయా కస్టమర్లకు తెలిపింది.ఇక ఈ మార్పులు జరుగుతున్న నేపథ్యంలో ఆ రెండు బ్యాంకు శాఖల ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్స్‌ ఏప్రిల్ 1వ తేదీ నుంచి మారుతున్నాయి.

వీటి స్థానాల్లో కొత్తగా యూబీఐ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్స్‌ అమల్లోకి రానున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.

ఇక ఈ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్స్ మార్పుల వల్ల ఏప్రిల్ 1వ తేదీ తర్వాత ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకుల చెక్‌ లు పనిచేయవని బ్యాంకు అధికారులు వెల్లడిస్తున్నారు.

ఎందుకంటే వీటి స్థానంలో కొత్త ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌, ఎంఐసీఆర్‌ నెంబర్‌ గల యూబీఐ చెక్‌ బుక్‌ తీసుకోవాల్సి ఉంటుందట.

ఇకపోతే ఈ రెండు బ్యాంకులకు సంబంధించిన కస్టమర్ల అకౌంట్ నెంబర్లు లో మార్పు లేదని, ఇక లావాదేవీల విషయంలో ఏమైనా అనుమానాలు ఉంటే ఖాతాదార్లు తమ శాఖలను సంప్రదించాలని యూబీఐ వెల్లడిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube