తాజాగా ఓ పిల్ల ఏనుగు తల్లి ఏనుగు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోలో పిల్ల ఏనుగు ను తల్లి ఏనుగు ఎంత సేపటికి తొండంతో కొట్టిన పిల్ల ఏనుగు లేవకపోవడంతో ఆ తల్లి విలవిలలాడి పోయింది.
ఆ తర్వాత తల్లి ఏనుగు అక్కడే ఉన్న మావటి వాళ్ళను పిలుచుక వచ్చి పిల్ల ఏనుగు ను చూడగానే అతడు ఏనుగు పిల్లను చేతితో నాలుగు సార్లు గట్టిగా కొట్టడంతో అది లేచి ఎప్పటిలాగానే పరుగులు పెట్టింది.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.
ఈ సంఘటన మొత్తం పరాగ్వే దేశంలోని ఓ జూలో జరిగింది.ఈ సన్నివేశాన్ని మొత్తం జూ అధికారులు వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.
ఈ వీడియోను భారతదేశ ఓ మాజీ ఫారెస్ట్ అధికారి పోస్ట్ షేర్ చేయగా ఆ వీడియో కు పెద్ద ఎత్తున లైక్ లు రావడం మొదలుపెట్టాయి.ఈ సంఘటనలో భాగంగా పిల్ల ఏనుగు అలా పడుకోవడానికి గల కారణం ఆ పిల్ల ఏనుగు రోజంతా పూర్తిగా ఆడుకొని అలసి పోయిందని ఆ జూ సిబ్బంది తెలియజేశారు.
దానితో ఆ పిల్లలకు ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవడంతో.ఆ సమయంలో తల్లి ఎంతసేపటికి నిద్ర లేపిన అది లేకపోవడంతో తన బిడ్డకు ఏమైందో అని తల్లి ఏనుగు కాస్త బెంగ పడినట్లు కనిపించింది.
చివరికి జూ సిబ్బంది అక్కడికి చేరుకొని ఆ చిన్న ఏనుగును నడుంపై పట్టడంతో ఎప్పటిలాగానే జాలిగా తన తల్లి దగ్గరికి వెళ్లి పోయింది.దాంతో పిల్ల ఏనుగు కు ఏం కాలేదని అర్థమైన తల్లి ఏనుగు సంతోషంతో అక్కడినుంచి వెళ్ళిపోయింది.ఈ వీడియో చూస్తే మనకు ఏనుగులు ఎంత తెలివైన వారు మనకు మరోసారి నిరూపితం అయింది.ఈ వీడియో చూసిన నెటిజన్స్ మనుషులమైన మరే జీవి ఏదైనా సరే తల్లి ప్రేమకు మరేదీ సాటి రాదని పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.
ఏది ఏమైనా తల్లి బిడ్డ అనుబంధాన్ని వర్ణించడం అంత సులువు కాదు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వైరల్ వీడియోను వీక్షించండి.