ఉద్యోగాల చిట్టాతో కేటీఆర్ ప్రతిపక్షాలను ఇరికించాడా?

తెలంగాణలో రోజురోజుకు రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.తెలంగాణలో ఎలాంటి బలం లేని బీజేపీ బలపడుతుండగా, కాంగ్రెస్ పార్టీ తమకు జరిగిన నష్టాన్ని పూడ్చుకునే పనిలో పడింది.

 Did Ktr Line Up The Opposition With The Jobs Log, Ktr, Trs Party-TeluguStop.com

అయితే ప్రతిపక్షాలు రోజూ ఏదో ఒక విషయం మీద విమర్శిస్తూనే ఉంటాయి.అయితే ప్రతిపక్షాలు అందరు కలిసి విమర్షించే ఒకే ఒక్క విమర్శ ఉద్యోగాలు.

నీళ్లు, నిధులు, నియామకాల మీద జరిగిన పోరాటంలో తెలంగాణ రాష్ట్రం సాధించాక టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ప్రతిపక్షాలు ఘాటుగా విమర్శిస్తున్నది మనం చూసాం.

అయితే ప్రతి సారి ఉద్యోగాల మీద శ్వేతపత్రం విడుదల చేయాలని నిలదీసే ప్రతిపక్షాలను కేటీఆర్ శ్వేత పత్రం విడుదల చేసి ప్రతిపక్షాలను ఇరుకున పెట్టాడా అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే కేటీఆర్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలలో తప్పులుంటే ఇప్పటికీ ఎంతో వ్యతిరేకించేవి.అయితే ఈ ఉద్యోగాల విడుదలతో ఈ విషయాన్ని పక్కనబెట్టి ఇతర విషయంపై చర్చిస్తుండడంతో ప్రజలు ఒకింత ఆలోచనలోపడ్డారు.కేటీఆర్ విడుదల చేసిన లెక్కల ప్రకారం ఇప్పటికే 1.36 లక్షల ఉద్యోగాలు కల్పించామని లేఖలో పేర్కొన్నారు.అయితే మరి కేటీఆర్ విసిరిన ఈ బాణం ప్రతిపక్షాలకు గట్టిగా తగిలిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.చూద్దాం ఈ అవకాశాన్ని టీఆర్ఎస్ ఎలా వినియోగించుకుంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube