ఉద్యోగాల చిట్టాతో కేటీఆర్ ప్రతిపక్షాలను ఇరికించాడా?

తెలంగాణలో రోజురోజుకు రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.తెలంగాణలో ఎలాంటి బలం లేని బీజేపీ బలపడుతుండగా, కాంగ్రెస్ పార్టీ తమకు జరిగిన నష్టాన్ని పూడ్చుకునే పనిలో పడింది.

అయితే ప్రతిపక్షాలు రోజూ ఏదో ఒక విషయం మీద విమర్శిస్తూనే ఉంటాయి.అయితే ప్రతిపక్షాలు అందరు కలిసి విమర్షించే ఒకే ఒక్క విమర్శ ఉద్యోగాలు.

నీళ్లు, నిధులు, నియామకాల మీద జరిగిన పోరాటంలో తెలంగాణ రాష్ట్రం సాధించాక టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ప్రతిపక్షాలు ఘాటుగా విమర్శిస్తున్నది మనం చూసాం.

అయితే ప్రతి సారి ఉద్యోగాల మీద శ్వేతపత్రం విడుదల చేయాలని నిలదీసే ప్రతిపక్షాలను కేటీఆర్ శ్వేత పత్రం విడుదల చేసి ప్రతిపక్షాలను ఇరుకున పెట్టాడా అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే కేటీఆర్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలలో తప్పులుంటే ఇప్పటికీ ఎంతో వ్యతిరేకించేవి.

అయితే ఈ ఉద్యోగాల విడుదలతో ఈ విషయాన్ని పక్కనబెట్టి ఇతర విషయంపై చర్చిస్తుండడంతో ప్రజలు ఒకింత ఆలోచనలోపడ్డారు.

కేటీఆర్ విడుదల చేసిన లెక్కల ప్రకారం ఇప్పటికే 1.36 లక్షల ఉద్యోగాలు కల్పించామని లేఖలో పేర్కొన్నారు.

అయితే మరి కేటీఆర్ విసిరిన ఈ బాణం ప్రతిపక్షాలకు గట్టిగా తగిలిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.

చూద్దాం ఈ అవకాశాన్ని టీఆర్ఎస్ ఎలా వినియోగించుకుంటుందో చూడాలి.

వైరల్ వీడియో: సిక్సర్ వెళ్లిన బంతిని తీసుకుని పారిపోయిన అభిమాని