బుల్లితెర యాంకర్ సుమ సోలోగా చేసినా, మరో యాంకర్ తో కలిసి చేసినా ఆ షోలు మాత్రం సూపర్ హిట్ అవుతాయి.తెలుగులోని అన్ని టాప్ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో షోలు చేస్తున్న సుమ బుల్లితెర నంబర్ 1 యాంకర్ గా కొనసాగుతున్నారు.
జీ తెలుగు ఛానల్ లో సుమ హోస్ట్ గా చేస్తున్న షోలలో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ షో కూడా ఒకటి.ఈ షోకు శివబాలాజీ, మధుమిత గెస్టులుగా వచ్చారు.
బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ప్రోమోలో శివబాలాజీ, మధుమిత జలజల జలపాతం నువ్వు సాంగ్ కు డ్యాన్స్ చేస్తూ ఎంట్రీ ఇచ్చారు.శివబాలాజీ, మధుమిత ఒకరినొకరు హగ్ చేసుకోగా రవి ” ఇంత గ్యాప్ వచ్చిందని అనుకోలేదు బాబాయ్” అని చెబుతాడు.
ఆ తరువాత సుమ రవిని అన్నయ్య అని పిలవగా మధుమిత రవి అన్నయ్య ఎప్పుడు అయ్యాడని అడుగుతుంది.సుమ గత ఎపిసోడ్ ను చూపిస్తూ ఇప్పటివరకు జీ తెలుగుకు ఒకరే అన్నయ్య అని ఇకపై రవి కూడా అన్నయ్యేనని చెబుతారు.
ఆ తరువాత రవి “ఇప్పటివరకు రవి మాటలతో మ్యాజిక్ చేయడం చూశారు.బట్ ఇక్కడ రవి” అని చెబుతుండగానే రవి మాటలతో మ్యాజిక్ చేస్తాడని మొదటిసారి నిజం చెప్పేశాడని సుమ అన్నారు.సుమ మధుమితను మీ లైఫ్ లో ఫేస్ చేసిన బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమిటని అడగగా గర్భవతి అయిన తరువాత బిడ్డ డౌన్ సిండ్రోమ్ తో బాధ పడుతోందని.డౌన్ సిండ్రోమ్ అంటే మానసికంగా ఎదగని కిడ్ పుడతారని డాక్టర్లు చెప్పారని తెలిపారు.
పేరెంట్స్ గా మీరు పిల్లలను బాగా చూసుకున్నా సొసైటీ అలా చూడదని డాక్టర్లు చెప్పారని మధుమిత చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.ఈ ఎపిసోడ్ రేపు ప్రసారం కానుంది.
దశాబ్దం క్రితం శివబాలాజీ, మధుమిత ఇద్దరూ వరుస అవకాశాలతో బిజీగా ఉండగా గతంతో పోలిస్తే ఇద్దరికీ అవకాశాలు తగ్గాయి.