ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరిస్తూ వస్తున్నా, తరచూ ఏపి ప్రభుత్వానికి ఇబ్బందులు మీద ఇబ్బందులు తీసుకొస్తూనే ఉన్నారు.ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు రకరకాల మార్గాల ద్వారా ప్రయత్నం చేస్తు వస్తున్నారు.
ఇది ఇలా ఉంటే , ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రమేష్ కుమార్ కు వ్యతిరేకంగా మాట్లాడడం, ప్రభుత్వ అధికారులను ఉద్దేశించి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సహకరిస్తే ఆ తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటారు అన్నట్లుగా హెచ్చరికలు చేయడం వంటి వ్యవహారాలపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీరియస్ అయ్యారు.మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని హౌస్ అరెస్ట్ చేయాలంటూ, డీజీపీ కి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలపై కోర్టుకు వెళ్లిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి ఊరట లభించింది.మంత్రిని హౌస్ చేస్తూ నిమ్మగడ్డ రమేష్ తీసుకున్న నిర్ణయం చెల్లుబాటు కాదని హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
నిమ్మగడ్డ ఇచ్చిన ఆదేశాలను కోర్టు కొట్టివేసింది.మంత్రి ఏదైనా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని, పర్యటనలు చేయవచ్చని హైకోర్టు తెలిపింది.
నిన్న నిమ్మగడ్డ ఆదేశాలపై మంత్రి కోర్టు కు వెళ్ళారు.దీనిపై ఉదయం నుంచి అటు నిమ్మగడ్డ, మంత్రి రామచంద్రా రెడ్డి తరుపు న్యాయవాదుల వాదనలు సుదీర్ఘంగా కొనసాగాయి.
ఇరు వాదనలు విన్న కోర్టు మొదటగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని రాష్ట్రపతి పర్యటనలో పాల్గొనేందుకు అనుమతించింది.
అయితే నిమ్మగడ్డ వాదనల్లో కొన్నిటిని మాత్రమే కోర్ట్ సమర్ధించింది.అయితే మీడియాతో మాట్లాడేందుకు మాత్రం ఆయనకు అనుమతి ఇవ్వలేదు.అసలు మంత్రికి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, ఏ విధంగా ఆయనను హౌస్ అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అనే వాదన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తరఫు న్యాయవాది తెరపైకి తెచ్చారు.
ఏకగ్రీవాలతో పల్లెలు అభివృద్ధి చెందుతాయి అనేది ప్రభుత్వ విధానం అని, హై కోర్టుకు న్యాయవాది తెలిపారు.మంత్రి హోదాలో రాష్ట్రంలో వివిధ అంశాలపై మంత్రి పర్యటించాలని, అదీ కాకుండా , ప్రస్తుతం ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన వివిధ ప్రాంతాల్లో పర్యటించాలన్న మంత్రి తరుపున న్యాయవాదుల వాదనను ఏకీభవించిన కోర్టు ఈ కీలక తీర్పు వెలువరించింది.