తెలుగు ఇండస్ట్రీలో తన అద్భుతమైన గాత్రం ద్వారా ఎన్నో పాటలకు ప్రాణం పోసిన సింగర్ సునీత ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నారు.దీనికి గల కారణం ఆమె రెండో వివాహం చేసుకోవడమే.
తన మొదటి భర్తతో విడాకులు తీసుకున్న సునీత,డిజిటల్ మీడియా కంపెనీ అధిపతి అయిన రామ్ ని రెండవ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసినదే.ఇంతవరకు సునీత సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, వ్యాఖ్యాతగా విధులు నిర్వహిస్తున్న ఈమెకు ఇప్పుడు మరి కొంత బాధ్యత పెరిగిందని చెప్పవచ్చు.
అయితే పెళ్లి తర్వాత తాజాగా ఓ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సునీత తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సునీత తనకు హీరోయిన్ గా నటించడానికి అవకాశం వచ్చిందనే విషయాన్ని తెలియజేశారు.
గులాబీ సినిమాలో ఈ వేళలో నీవు అనే పాట పాడిన తర్వాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్కూల్ నుంచి హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చిందని సునీత తెలిపారు.అంతేకాకుండా దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తనకు హీరోయిన్ అవకాశం కల్పించారని తెలియజేశారు.
కానీ నటన పై తనకి ఆసక్తి లేకపోవడం వల్ల ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదని, అప్పటికే సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి ఫామ్ లో ఉన్నానని ఈ సందర్భంగా సునీత తెలిపారు.
ఇండస్ట్రీకి దగ్గరగా ఉంటూ హీరోయిన్ లు పడే టెన్షన్ దగ్గరగా ఉండి చూడటం వల్ల ఆ రంగం వైపు వెళ్లడానికి ఆసక్తి చూపలేదని, అసలు నటన వైపు వెళ్లాలనే ఆలోచన కూడా తనకు లేదని ఈ సందర్భంగా తెలిపారు.ఒకవేళ ఇప్పుడు అవకాశాలు వస్తే నటిస్తారా? అని సునీతను అడగగా అదెలా సాధ్యమవుతుంది.నిజం చెప్పాలంటే నా జీవితంలో టెన్షన్స్ లేకుండా ఎంతో తృప్తిగా బ్రతకడానికి ఇష్టపడతా అంటూ ఈ సందర్భంగా ఆమె తెలిపారు.