తమిళనాడు మాజీ సీఎం జయలలిత స్నేహితురాలు శశికళ గత 4 సంవత్సరాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న తరుణంలో మరో వారం రోజుల్లో విడుదల కావాల్సి ఉంది. కర్ణాటక రాష్ట్రంలోని పరప్పణ అగ్రహాన జైల్ లో తాజాగా ఆమె అస్వస్థతకు గురి అవడంతో వెంటనే అక్కడ వాళ్ళు ఆమెను విక్టోరియా హాస్పిటల్ కు తరలించారు.
శశికళ జ్వరం, వెన్నునొప్పి, టైప్ 2 డయాబెటిస్, హైపర్ టెన్షన్, హైపర్ థైరాయిడిజం, శ్వాస సంబంధిత లక్షణాలు కనబడటంతో వెంటనే పరీక్షలు నిర్వహించగా అందులో మొదటగా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది.
చికిత్స క్రమంలోనే శశికళ ఆక్సిజన్ శాచురేషన్ లెవెల్ 80 కి పడిపోవడంతో వెంటనే ఐసియు కు తరలించి చికిత్స అందజేస్తున్నారు వైద్యులు.
ఇక చిన్నమ్మకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిన వెంటనే ఆమె మేనల్లుడు దినకరన్ వెంటనే బెంగళూరు నగరానికి చేరుకొని ఆమె ఆరోగ్యం పట్ల జైలు అధికారులతో పాటు హాస్పిటల్ వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా శశికళ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు ఆమెను చాలా చక్కగా చూసుకుంటున్నారని తెలియజేశాడు.వాస్తవానికి శశికళ జనవరి 27న జైలు నుండి విడుదల కావాల్సి ఉండగా.ప్రస్తుతం కరోనా వైరస్ బారిన పడడంతో ఆమె జైలు నుంచి విడుదల అయ్యే పరిస్థితులు కనబడటం లేదు.
ఇదిలా ఉండగా మరోవైపు చిన్నమ్మ జైలు నుంచి విడుదల అవుతున్న సందర్భంలో ఆమెకు ఫాన్స్ ఘన స్వాగతం పలికేందుకు అనేక ఏర్పాట్లు చేశారు .భారీ ర్యాలీతో ఆమెకు స్వాగతం పలికేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు.తాజాగా చిన్నమ్మ ఆరోగ్యం కాస్త ఆందోళనకరంగా మారడంతో అభిమానుల్లో నిరాశగా మిగిలిపోయింది.ఇక ఆమె త్వరగా కోలుకోవాలని శశికళ అభిమానులు పూజలు నిర్వహిస్తున్నారు.