డైరెక్టర్ తేజ కొడుకు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా..హీరో అవ్వబోతున్నాడు

తెలుగు సినిమా ఇండస్ట్రీలోని డైరెక్టర్లలో తేజ గారిది ఒక డిఫరెంట్ స్టైల్ అని చెప్పాలి.ఆయన చిన్నతనంలో పడ్డ కష్టాలు ఏ డైరెక్టర్ పడలేదని కూడా మనందరికీ తెలుసు.

 Director Teja Son Amitov Turns Hero,director Teja Son Amitov ,film Industry, Dir-TeluguStop.com

ఈయన సినిమాల్లోకి రాక ముందు తినడానికి తిండి కూడా సరిగా లేక ఎన్నో కష్టాలు పడ్డారు డైరెక్టర్ తేజ.అందుకే ఈయనకు జీవితం అన్నా, చేసే పని అన్న ఎంతో గౌరవం.ఈయన డైరెక్టర్గా ఎన్నో హిట్ సినిమాలు ఫ్లాప్ సినిమాలు తీసిన కూడా తేజ గారి రేంజ్ మాత్రం తగ్గదు.ఈయన 1995 ఆ టైంలో సినిమాటోగ్రాఫర్ గా పని చేసేవారు.

మరీ ముఖ్యంగా ఈయన కెరీర్ స్టార్టింగ్ లో ఆర్జివి గారి సినిమాలకు కెమెరామెన్ గా వర్క్ చేసేవారు.ఆ టైం లోనే ఆయనకు శ్రీవల్లి అనే అమ్మాయి తో పెళ్ళి జరగడం.

ఇద్దరు పిల్లలకి జన్మనివ్వడం కూడా జరిగిపోయింది.తేజ వాళ్ళ అబ్బాయి అమితవ్ 1995లో ముంబైలోనే జన్మించాడు.

అలా కెమెరామన్ గానే తన లైఫ్ సాగిస్తూ డైరెక్షన్ అవకాశం కోసం చూస్తున్న తేజ గారి పనితనం రామోజీ రావుగారికి నచ్చడం, చిత్రం సినిమాకి డైరెక్టర్ గా అవకాశం ఇవ్వడం చక చక జరిగిపోయింది.ఈ చిత్రం సినిమా 2000 ల సంవత్సరం లో విడుదల అయ్యి సూపర్ డూపర్ హిట్ అయినా సంగతి మనందరికి తెలిసిందే.
అయితే తేజగారి మొదటి చిత్రంలోనే తన కొడుకు అమితవ్ ని చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండిస్టీకి పరిచయం చేసాడు.అలా ఈ చిత్రం సినిమా హిట్ అవ్వడంతో డైరెక్టర్ గా మంచి పేరు రావడంతో ఇక పూర్తిస్థాయిలో డైరెక్టర్ గానే ఉందాం అనుకోని తన కొడుకు అమితవ్ కి రెండేళ్ల వయసున్నప్పుడు జూబ్లీహిల్స్ కి షిఫ్ట్ అయ్యాడు తేజ.అంతేకాదు పిల్లలకి ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు మంచి చదవు, జ్ఞానం ఇస్తే చాలు వాళ్ళే బతికేస్తారు అని నమ్మే తేజ గారు పిల్లల్ని బాగా చదవించారు.అమితవ్ ని ఇంటర్నేషనల్ స్కూల్ అఫ్ హైదరాబాద్ లో జాయిన్ చేసాడు.

అక్కడ బాగా చదువుకోవడంతో పాటు అమితవ్ బాక్సింగ్ పై కూడా మంచి పట్టు సాధించాడు.ఇంకా సినిమాలపై ఉన్న ఇష్టంతో అటు చదవుకోవడంతో పాటు మహేష్ బాబు నటించిన నిజం సినిమాకి అమితవ్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు అంతేకాదు కృష్ణ వంశి దర్శకత్వం లో వచ్చిన గోవిందుడు అందరివాడేలే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పని చేసాడు.

Telugu Amitov, Chitramchild, Teja, Teja Son Amitov, Tejason, Jayam-Telugu Stop E

అంతేకాదు సినిమా గురించి తెలుసుకోవాలని, ఈ ఫీల్డ్ లోనే ఎలాగైనా రాణించాలని కాలిఫోర్నియా వెళ్లి ఫిలిం అండ్ టెలివిజన్ ప్రొడక్షన్ ప్రోగ్రాం లో గ్రాడ్యుయేషన్ చేయడానికి జాయిన్ అయ్యాడు.కానీ మొదటి సెమిస్టరు వరకు ఉండి.ఆ తర్వాత యాక్టింగ్ నేర్చుకోవడానికి న్యూ యార్క్ కి షిఫ్ట్ అయ్యాడు.అక్కడ లీ స్టార్స్ బెర్గ్ థియేటర్ అండ్ ఫిలిం ఇన్సిటిట్యూట్ లో ఫుల్ టైంలో ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు.

అంతేకాదు తన తండ్రి వారసత్వంగా ఇటీవలే ఒక షార్ట్ ఫిలింకి కూడా డైరెక్షన్ చేసాడు.ఇక ప్రస్తుతానికి తండ్రి తేజ గారు స్థాపించిన సామాజ్యం.మోషన్ పిక్చర్ ఎక్సిబిషన్ కంపెనీ కి, జయం మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ కి అలాగే చిత్రం మూవీస్ సంస్థ కి సీఈఓ గా ఇటీవలే బాధ్యతలను తీసుకున్నాడు.దానితో పాటు ఒక మంచి సినిమాలో అవకాశం కోసం చూస్తున్నాడు.

అయితే ఇటీవలే కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అమితవ్ తో ఒక సినిమా చేయబోతున్నట్టు అనౌన్స్ చేసాడు కానీ అది కొన్ని కారణాల వలన ఆగిపోయింది.అయితే తేజ గారి అబ్బాయి కనుక మంచి స్టోరీ దొరకడానికి పెద్ద టైం పట్టదు.

సో, అతి త్వరలో తేజ కొడుకు అమితవ్ ని హీరోగా మనం చూడవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube