ఈ మధ్య వచ్చిన వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలోని చాలా జిల్లాల్లోని ప్రజలు ఆర్థికంగా నష్టపోయారు.ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతం వాసులకు ఈ ఎఫెక్ట్ ఎక్కువగా పడింది.
తెలంగాణ ప్రభుత్వం వరద ప్రభావిత ప్రజలను ఆదుకుంటాం వారికి తక్షణమే నష్ట పరిహారం చెలిస్తాం అని చెప్పింది.ఈలోగా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎలెక్షన్స్ రావడంతో మీ సేవ ద్వారా డబ్బులు తీసుకోవాలని చెప్పింది.
అందుకు బీజేపీ అడ్డు చెప్పి ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసింది.దాంతో వరద సహాయం నిలిచిపోయింది.
ఎన్నికల ఫలితాల తర్వాత అంటే 7 నుండి ఆ సాయంను పొందవచ్చు అంటూ చెప్పింది.
ఎన్నికలు ఫలితాలు వెల్లువడ్డాయి పరిస్థితులు అని చక్క బడ్డాయి.
ఇక మీ సేవ కేంద్రాల్లో 7 నుండి వరద సాయం ను పొందవచ్చు అని చూస్తున్న భాదితులకు జీహెచ్‌ఎంసీ కమీషనర్ షాకింగ్ విషయం తెలిపాడు.వరద సాయంలో కొన్ని అవక తవకలు ఉన్నాయని.
అధికారులతో ఓ సర్వేను వేస్తున్నాం.ఎవరు ఎంత నష్టపోయారు.
ఎవరు కి బాగా నష్టం జరిగింది అనే దానిపై సర్వే జరుగుతుంది.నేరుగా వారి బ్యాంక్ అక్కౌంట్ లోకి డబ్బు వేసే విదంగా చర్యలు తీసుకుంటున్నం.
బ్యాంక్ అక్కౌంట్, ఆధార్ కార్డ్ డిటేల్స్ ఇవ్వవలిసిందిగా జీహెచ్‌ఎంసీ కమీషనర్ తెలిపాడు.ఇక బాధితులు మాత్రం ఇది ప్రజలను మోసం చెయ్యడమే అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.