తెలుగులో హాట్ యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న అందాల భామ అనసూయ.ఈ అమ్మడు యాంకర్ గా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత క్షణం సినిమాతో నటిగా తెరంగేట్రం చేసి మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది.
తరువాత సుకుమార్ రంగస్థలం సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ లో స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయింది.తరువాత వరుసగా అవకాశాలు వచ్చిన అన్ని సినిమాలు ఒకే చెప్పకుండా మనసుకి నచ్చిన కథలు మాత్రమే చేస్తూ వచ్చింది.
ప్రస్తుతం ఆచార్య, పుష్ప, రంగమార్తాండ సినిమాలలో ఆమె కీలక పాత్రలలో కనిపించబోతుంది.ఇదిలా ఉంటే అనసూయ మెయిన్ లీడ్ గా గతంలో కథనం అనే సినిమా తెరకెక్కింది.
ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేకపోయింది.అయితే ఈ సారి మరో విభిన్న కథాంశంతో మెయిన్ లీడ్ గా ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధం అవుతుంది.
థాంక్యూ బ్రదర్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనసూయతో పాటు అశ్విన్ విరాజ్ అనే కొత్త నటుడు తెరంగేట్రం చేస్తున్నాడు.ఈ సినిమాతో రమేష్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.ఇదిలా ఉంటే ఈ సినిమా ఫస్ట్ లుక్ ని తాజాగా సాయి ధరమ్ తేజ్ రిలీజ్ చేశాడు.ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో అనసూయ ఏకంగా తొమ్మిది నెలల కడుపుతో ఉంది.
ఆమెకి అపోజిట్ గా అశ్విన్ విరాజ్ ఉన్నాడు.లాక్ డౌన్ సమయంలో ఓ అపార్ట్మెంట్ లో జరిగిన స్టోరీగా ఇది ఉండబోతుంది ఇప్పటికే చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చేసింది.
టైటిల్ పోస్టర్ లో లిఫ్ట్ ఫోటోని పెట్టి ఇప్పుడు అనసూయని ప్రెగ్నెంట్ లేడీగా రిప్రజెంట్ చేయడం ద్వారా కథపై కొంత ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది.దానికి తగ్గట్లే థాంక్యూ బ్రదర్ అని టైటిల్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది.
మరి అనసూయకి సోలోగా ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది అనేది వేచి చూడాలి.