ప్రముఖ భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత ధోని ఐపీఎల్ మ్యాచ్ లలో దర్శనమిచ్చాడు.అయితే ఈసారి ఐపీఎల్ లో చెన్నై టీం చిత్తుగా ఓడిపోవడంతో వచ్చేసారి చెన్నై టీం కి కెప్టెన్ గా ఉంటాడో, ఉండడో తెలియకపోవడంతో తన దృష్టి బిజినెస్ వైపు మళ్ళించాడు.
ఈ క్రమంలోనే కడక్ నాథ్ కోళ్ల ను పెంచాలని ధోని నిర్ణయించుకున్నాడు.
ఈ కోళ్లను పెంచేందుకు రాంచీ వెటర్నరీ కాలేజీ స్నేహితుడి సహాయంతో మధ్యప్రదేశ్ లో ఉన్న ఓ పౌల్ట్రీ ఫామ్ కు చెందిన రైతుకు ధోని 2000 కడక్ నాథ్ కోడి పిల్లలను ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపారు.
ఈ విషయాన్ని ఆ రైతు స్వయంగా తెలిపారు డిసెంబర్ 15వ తేదీ లోపు తనకు రెండు వేలు కడక్ నాథ్ కోడి పిల్లలను అందించాల్సిందిగా ధోని కోరినట్లు ఆ రైతు తెలిపాడు.

ఈ కడక్ నాథ్ కోళ్లను మహేంద్రసింగ్ ధోని రాంచీలోని తన ఫాంహౌస్ లో పెంచుతున్నట్లు తెలిపారు.సాధారణ కోళ్ళతో పోలిస్తే కడక్ నాథ్ కోళ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిదని, వీటికి ప్రస్తుతం ఎంతో డిమాండ్ ఉందని తెలిపారు.సాధారణ కోళ్ల లో ఫ్యాట్ 25 శాతం ఉంటే, కడక్ నాథ్ కోళ్ల లో కేవలం1.94 శాతం మాత్రమే ఉంటుంది.అంతేకాకుండా సాధారణ కోళ్ల లో 218 మిల్లీగ్రాములు కొలెస్ట్రాల్ ఉంటే, కడక్ నాథ్ కోళ్ల లో కేవలం 59 మిల్లిగ్రాముల కొలెస్ట్రాల్ ఉంటుంది.
సాధారణ కోళ్లలో కంటే ఈ కోళ్ళలో ప్రోటీన్ శాతం అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని, రైతులు అనేక చోట్ల ఈ కోళ్ల పెంపకాన్ని ప్రారంభించి అధిక లాభాలను పొందుతున్నారు.ఈ కోళ్లకు ఎంతో డిమాండ్ ఉండటం వల్ల మహేంద్రసింగ్ ధోని కూడా ఈ కోళ్ల బిజినెస్ ను స్టార్ట్ చేయాలని భావించారు.