సౌత్ ఇండియాలో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న నటి అమలాపాల్.హీరోయిన్ గా కెరియర్ మంచి స్పీడ్ మీద ఉన్న సమయంలోనే దర్శకుడు ఏఎల్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
అయితే వారిద్దరి కాపురం కనీసం రెండేళ్లు కూడా కాకుండానే విడాకులు తీసుకున్నారు.తరువాత మళ్ళీ హీరోయిన్ గా సినిమాలు చేస్తున్న ఒకప్పటి స్పీడ్ అందుకోలేకపోతుంది.
అయితే విజయ్ తో విడాకుల తర్వాత ముంబైకి చెందిన సింగర్ భవిందర్ సింగ్ తో కొంతకాలం డేటింగ్ చేసింది.అయితే మళ్ళీ ఏమైందో అతనితో కూడా విడిపోయింది.
కరోనా లాక్ డౌన్ సమయంలో వీరిద్దరి పెళ్ళికి సంబందించిన ఫోటోలు బయటకి వచ్చాయి.ఆ ఫోటోలని భవిందర్ సింగ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
దీంతో వారిద్దరికీ పెళ్లి అయిపోయిందని చాలా మంది భావించారు.అయితే అవి ఒక యాడ్ ఫిల్మ్ కి సంబందించిన ఫోటోలు అని తరువాత అమలాపాల్ క్లారిటీ ఇచ్చింది.
ఆ ఫొటోలను తన మాజీ ప్రియుడు భవిందర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై అమలాపాల్ సీరియస్ అయ్యింది.తన ఫొటోలను తప్పుడు ఉద్దేశ్యంతో పోస్ట్ చేసిన భవిందర్‌పై పరువు నష్టం కేసు వేయడానికి అనుమతి ఇవ్వాలని చెన్నై కోర్టుని అమలాపాల్ కోరింది.
కేసు వివరాలు విన్న జడ్జ్ భవిందర్ సింగ్‌పై కేసు వేయడానికి కోర్టు అనుమతి ఇవ్వడంతో ఆమె పరువునష్టం దావా వేయడానికి రెడీ అయ్యింది.అయితే దీనిపై భవీందర్ ఎలాంటి వివరణ ఇస్తాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.