తాచుపాము బురద పాము అంటూ వీర్రాజు ఫైర్ ?

చాలా రోజులుగా సైలెంట్ గా ఉంటూ వస్తున్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఒక్కసారిగా తన మాటలను తూటాల్లా బయటకు వదిలారు.ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరించిన తరువాత, టీడీపీ వైసీపీలను టార్గెట్ చేసుకుంటూ ఎన్నో విమర్శలు చేశారు.

 Ap Bjp President Somu Veeraju Sensational Coments On Cbn, Ap Bjp President, Somu-TeluguStop.com

ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా త్వరలోనే జనసేనతో కలిసి అధికారం దక్కించుకుంటాము అంటూ ధీమా వ్యక్తం చేస్తూ హడావుడి చేసే వారు.అయితే ఆ తర్వాత వైసీపీ విషయంలో బీజేపీ వైఖరి మారడంతో, పూర్తిగా సైలెంట్ అయిపోయారు.

ఏపీ లో ఎన్ని రాజకీయ పెనుమార్పులు చోటు చేసుకుంటున్నా, వీర్రాజు మాత్రం సైలెంట్ గానే ఉంటూ వచ్చారు.తాజాగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును ఉద్దేశించి వీర్రాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు.

గతంలో టీడీపీ బీజేపీ పొత్తు రద్దయిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను వీర్రాజు వివరించారు.గతంలో ఓసారి బీజేపీతో పొత్తు వద్దని చంద్రబాబు ఏకపక్షంగా ప్రకటించారని, కానీ దాని కారణంగా ఎంత నష్టపోతున్నాడో తెలుసుకొని, ఆ రోజు సాయంత్రానికి మాట మార్చేశాడు అని, వచ్చి మా కాళ్ళు పట్టుకున్నాడు అంటూ , సంచలన విమర్శలు చేశారు.

విజయనగరం జిల్లాలకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు గద్దె బాబురావు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ విషయాలను ప్రస్తావించారు.చంద్రబాబు తాచుపాము కాదని , బురద పాము అని, చంద్రబాబు నైజం ఇదే విధంగా ఉంటుందని, వాడుకుని వదిలేసే రకం అంటూ వీర్రాజు తీవ్ర విమర్శలు చేశారు.

ఈ సందర్భంగా టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.టి.రామారావు  రాజకీయాల నుంచి తప్పుకునేందుకు ప్రయత్నించారని, కానీ, అద్వానీ, వాజ్ పాయ్ చొరవతో ఆ ప్రయత్నాన్ని ఆయన విరమించుకున్నారు అని, కానీ చంద్రబాబు మాత్రం ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారు అంటూ, వీర్రాజు సంచలన విమర్శలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube