భారత్ లో కరోనా విజృంభణ .. 24 గంటల్లో ఎన్ని పాజిటివ్ కేసులంటే !

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి జోరు ఏ మాత్రం తగ్గడం లేదు , ప్రతిరోజూ కూడా భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.దేశంలో తాజాగా గడిచిన 24 గంటల్లో 63,371 కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

 India Corona Update, Indiacovid19, Covid19, India Corona, India-TeluguStop.com

దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 73,70,469కి చేరింది.ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా పై నేడు హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

అలాగే , గడిచిన 24 గంటల్లో 70,338 మంది కరోనా నుంచి కోలుకున్నారు.దీనితో దేశంలో ఇప్పటివరకు కరోనా నుండి కోలుకున్నవారి సంఖ్య 64,53,780 కి చేరింది.

ఇకపోతే , ప్రస్తుతం దేశంలో 8,04,528 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.కొత్తగా 895 మంది కరోనాతో మృతిచెందారు.

దీంతో దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,12,161కి చేరింది.దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి.

మరోవైపు దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుంది.

ఇక ,గురువారం రోజున దేశవ్యాప్తంగా 10,28,622 శాంపిల్స్‌ను పరీక్షించారు.

దీంతో ఇప్పటివరకు నిర్వహించిన కరోనా టెస్టుల సంఖ్య 9,22,54,927కి చేరింది.దేశంలో దాదాపు 87.56 శాతం కరోనా రికవరీ రేటు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube