ఐపీఎల్ 2020 లో నేడు 24వ మ్యాచ్ జరుగుతోంది.అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి.టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు 5 వికెట్లో కోల్పోయి.164 పరుగులు చేసింది.కెప్టెన్ దినేష్ కార్తీక్ 58, ఓపెనర్ శుభమాన్ గిల్ 57 పరుగులతో రాణించి జట్టుకి గౌరవ పదమైన స్క్రోర్ ను అందించాయి.
అయితే , కేకేఆర్ జట్టు బ్యాటింగ్ ఆదిలోనే తడబడింది.12 పరుగులకే తొలి వికెట్ రూపంలో రాహుల్ త్రిపాఠి 4 పరుగులకే ఔటయ్యాడు.ఆ తర్వాత 14 పరుగుల వద్ద నితీష్ రానా 2 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మోర్గాన్ తో కలిసి శుభమాన్ గిల్ ఇన్నింగ్ చక్కదిద్దాడు.ఇయాన్ మోర్గాన్ 24 రన్స్ చేసి ఔట్ అయ్యాడు.47 బంతుల్లో 57 పరుగులు చేసిన గిల్ రనౌట్ అయ్యాడు.ఇక కెప్టెన్ కార్తీక్ ఈ మ్యాచ్‌లో అదరగొట్టాడు.
కేవలం 29 బంతుల్లో 63 రన్స్ సాధించాడు.రస్సెల్ కేవలం 5 పరుగులకే వెనుదిరిగాడు.
ఇక కెప్టెన్ దినేష్ కార్తీక్ 58 పరుగులు చేసిన ఐపీఎల్‌లో 19వ హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు.
ఇక పంజాబ్ బౌలర్లు మొదటి నుండి చక్కనైన బంతులతో కేకేఆర్ బ్యాట్ మెన్స్ ను కట్టడి చేశారు.
దీనితో కేకేఆర్ ఓ మాదిరి స్క్రోర్ కే పరిమితం కావాల్సి వచ్చింది.ఇక చూడాలి మరి పంజాబ్ బ్యాట్ మెన్స్ ఏమేర రాణిస్తారు అనేది.