బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోవడం లేదనే సంగతి తెలిసిందే.బిగ్ బాస్ షో రేటింగ్స్ క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.
ఇదే సమయంలో గతంలో ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లు షోపై చేస్తున్న వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.కొన్ని రోజుల క్రితం బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ వితికా షేరు బిగ్ బాస్ షో వల్ల తాను డిప్రెషన్ లోకి వెళ్లిపోయానని సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా సింగర్, నటుడు నందు భార్య బిగ్ బాస్ షోపై సెటైర్లు వేశారు.బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ఇలాంటి వివాదాలను పెద్దగా పట్టించుకోరు.వివాదాలు ఉంటేనే షోకు పబ్లిసిటీ వస్తుందని బిగ్ బాస్ నిర్వాహకులు భావిస్తూ ఉంటారు.ఈ షో నుంచి బయటకు వచ్చిన కంటెస్టెంట్లు సైతం షోపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ ఉంటారు.
తాజాగా సింగర్ గీతామాధురి సోషల్ మీడియా అకౌంట్ ద్వారా బిగ్ బాస్ షోపై కామెంట్లు చేశారు.
నాచురల్ స్టార్ నాని హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొన్న గీతామాధురి రన్నరప్ గా నిలిచారు.చాలామంది ఆమె విన్నర్ అవుతుందని భావించినా కౌశల్ ఆ సీజన్ కు విన్నర్ గా నిలిచారు.చివరి వరకు గట్టి పోటీ ఇచ్చిన గీతామాధురి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సమయంలో తీసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ ఫోటోలో గీతామాధురి బక్కపలచగా ఉన్నారు.
ఇది తాను రెండు సంవత్సరాల క్రితం తీసుకున్న ఫోటో అని.ఎవరైనా బరువు తగ్గి సన్నగా కావాలని భావిస్తే బిగ్ బాస్ షోకు వెళ్లండని సూచించారు.గీతామాధురి సోషల్ మీడియాలో చేసిన కామెంట్ ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.
కొందరు నెటిజన్లు గీతామాధురి బిగ్ బాస్ షోపై భలే సెటైర్లు వేసిందే అని కామెంట్లు చేస్తున్నారు.