కింగ్ నాగార్జున హోస్ట్‌గా ఇటీవల ప్రారంభమైన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ నాల్గువ సీజన్.నాలుగు వారాలు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.
నాల్గువ వారంలో ఎవరూ ఊహించని విధంగా వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చి స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ అయింది.దేత్తడి హారిక, కుమార్ సాయి, సొహైల్, స్వాతి దీక్షిత్, మెహబూబ్, లాస్య, అభిజిత్ నామినేషన్స్‌లో ఉండగా.
స్వాతి దీక్షిత్‌ను శనివారమే నాగార్జున డైరెక్ట్‌గా ఎలిమినేట్ చేశారు.హౌస్‌లోకి వచ్చిన వారానికే ఆమె ఎలిమినేట్ అవ్వడం ఇంటి సభ్యులతో పాటు బిగ్ బాస్ ప్రియులకు కూడా షాక్ అని చెప్పాలి.
ఇక నాల్గవ వారం ఎలిమినేట్ అయిన స్వాతి దీక్షిత్.వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిగ్ బాస్ ఇంటి గుట్టు బయట పెడుతోంది.తాజాగా బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌కి ఇచ్చిన బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో ఇంటి సభ్యుల గురించి పలు ఆసక్తికర విషయాలు బయటపెట్టింది.ఈ క్రమంలోనే మోనాల్ గురించి మాట్లాడుతూ.
మనుషుల ఫీలింగ్స్‌తో ఆడుకుంటుందని స్వాతి తేల్చి చెప్పింది.అఖిల్, అభిజిత్ మధ్య చిచ్చు పెడుతుందని అనిపిస్తుందని చెప్పిన స్వాతి.
గేమ్ ఆడితే ఆడుకోవచ్చు కానీ.వేరే వాళ్ల ఫీలింగ్స్‌తో ఆడుకోకూడదని తెలిపింది.
అలాగే అఖిత్ మోనాల్‌పైనే ఫోకస్ పెట్టాడని.ఆమెనే గుడ్డిగా నమ్ముతున్నాడని స్వాతి పేర్కొంది.అభిజిత్ గురించి మాట్లాడుతూ.మొదట మోనాల్‌కు దగ్గరైన అభి.ఇప్పుడు ఆమెను పక్కన పెట్టి హారికకు కనెక్ట్ అవుతున్నాడని చెప్పేసింది.ఇక హారిక సైతం అభిజిత్‌పైనే దృష్టి పెట్టింది.
అభిజిత్ తనకే సొంతం అన్నట్టుగా వ్యవహరిస్తుందని తెలిపింది స్వాతి.
ఇక తనను ఎలిమినేషన్‌కు నామినేట్ చేసిన అమ్మా రాజశేఖర్ మాస్టర్ గురించి స్వాతి దీక్షిత్ మాట్లాడుతూ.
వామ్మో ఆయన సాధారన వ్యక్తి కాదు.ఈయన మహా కంత్రీ.
మాస్టర్‌ను అస్సలు నమ్మ కూడదని తేల్చి చెప్పింది.కాగా, నమ్మకద్రోహం చేసిన అమ్మా రాజశేఖర్‌పై ఇప్పటికే స్వాతి ఐదో వారం కెప్టెన్సీ రేసులో పాల్గొనడానికి వీలు లేకుండా బిగ్ బాంబ్ విసిరిన సంగతి తెలిసిందే.