హైదరాబాదులో ఇప్పటికే సినిమా స్టూడియోలు చాలానే ఉన్నాయి.రామోజీ ఫిలిం సిటీ, రామానాయుడు స్టూడియో, సారథి స్టూడియో, పద్మాలయ స్టూడియో, రామకృష్ణ సినీ స్టూడియో ఇంకా చిన్న చిన్న స్టూడియోలు చాలా ఉన్నాయి.
అయినా కూడా కొత్త స్టూడియో మరోటి రాబోతుంది.ఈ మధ్యకాలంలో కొత్త స్టూడియోలు ప్రారంభించిందే లేదు.
గడచిన పాతిక ముప్పై సంవత్సరాలుగా హైదరాబాదులో కొత్త స్టూడియోలు ఏది ఏర్పాటు కాలేదు.ఎట్టకేలకు అల్లు వారు కొత్త స్టూడియోను ఏర్పాటు చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
అల్లు అరవింద్ చాలా కాలంగా స్టూడియోను నిర్మించాలనే కోరిక తో ఉన్నారు.ఆయన కోరికను ఆయన తనయులు నెరవేర్చేందుకు సిద్ధమవుతున్నారు.
నేడు అల్లు రామలింగయ్య 99 వ జయంతి సందర్భంగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఉన్న 15 ఎకరాల భూమిలో ఈ స్టూడియోను ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతున్నట్లుగా అల్లు ఫ్యామిలీ అధికారికంగా ప్రకటించింది.
ఇక ఈ స్టూడియోను వచ్చే ఏడాది ఇదే రోజున అంటే అల్లు రామలింగయ్య 100 వ జయంతి రోజున ప్రారంభించాలని కూడా అల్లు వారి ఫ్యామిలీ చాలా బలంగా నిర్ణయించుకుంది.అత్యాధునిక టెక్నాలజీతో ఈ స్టూడియోను నిర్మించబోతున్నారు.
ఈ స్టూడియోలో ఇండోర్ మరియు ఔట్ డోర్ షూటింగ్ కు ఏర్పాట్లు ఉంటాయి.భారీ సెట్టింగ్ లకు కూడా అవకాశం ఉంటుందట.
ఏడాది కాలంలోనే స్టూడియో నిర్మాణం పూర్తి చేయాలని భావిస్తున్నారు.అల్లు వారి ఫ్యామిలీ ప్రకటించిన కొత్త స్టూడియో ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది.