ఆలు లేదు, సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు గా తయారైంది టిడిపి పరిస్థితి.సాధారణ ఎన్నికలు 2024లో కానీ వచ్చే పరిస్థితి లేదు.
అయినా టిడిపి అధినేత చంద్రబాబులో మాత్రం ఎన్నికల హడావుడి ఎక్కువగా కనిపిస్తోంది.త్వరలోనే ఎన్నికలు వస్తాయని బాబు గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు.
అసలు కేంద్రంలో ఎటువంటి సంకేతాలు కనిపించకపోయినా, బాబు మాత్రం 2022 లో తప్పనిసరిగా ఎన్నికలు వస్తాయనే ఆశలు ఉన్నారు.టీడీపీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక వెలుగు వెలుగుతున్నా, అతిపెద్ద పార్టీగా ఉంటూ వచ్చేది.
కానీ 2019 ఎన్నికల్లో ఎప్పుడు చవిచూడని ఘోరమైన ఫలితాలను చవిచూసింది.కేవలం 23 స్థానాలతో టిడిపి సరిపెట్టుకుంది.
అప్పటి నుంచి పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం అలుముకున్నా, పార్టీకి రాజకీయ భవిష్యత్తు లేదనే విశ్లేషణలు మొదలైనా, ఆ పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి అంగీకరించడం లేదు.
పార్టీకి బలమైన క్యాడర్ ఉందని, పార్టీ రాజకీయ భవిష్యత్ కు ఎటువంటి ఢోకా లేదని, అనవసర ఆందోళన చెందవద్దని, పార్టీ నాయకులతో తరచుగా సమావేశాలు నిర్వహిస్తూ, ఉత్సాహం తీసుకువచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీని నిర్లక్ష్యం చేశారని, పూర్తిగా ప్రభుత్వ కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని, పార్టీ నష్టపోతుందని ముందుగా గ్రహించలేకపోయారు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.బాబు బాధ ఇలా ఉంటే, టిడిపి నాయకుల్లో మాత్రం ఇంకా నిరుత్సాహం అలుముకునే ఉంది.
ఇప్పటికే బిజెపి జనసేన పార్టీలు బలం పుంజుకుని టిడిపిని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నాయి.
మరోవైపు అధికార పార్టీ వైసిపి టిడిపిని టార్గెట్ చేసుకుని పార్టీ నాయకులందరినీ తమ పార్టీలో చేర్చుకునేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
రెండు రోజుల క్రితం ప్రకటించిన పార్టీ పదవుల విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే, పార్టీ సీనియర్లు ఎవరూ ఆ పదవులను తీసుకోవడానికి ఇష్టపడకపోవడంతో జూనియర్ నాయకులకి పార్టీ పదవులను కట్టబెట్టాల్సిన పరిస్థితి చంద్రబాబు కు వచ్చింది.ఇప్పుడు ప్రస్తుతం పార్టీలో యాక్టివ్ గా ఉన్న నాయకులు సైతం అవకాశం దొరికితే, పార్టీ మారేందుకు అన్ని రకాలుగానూ సిద్ధంగా ఉన్నారు.
ఈ తరుణంలో ఎన్నికలు వస్తే నియోజకవర్గాల వారీగా ఎవరు పార్టీని లీడ్ చేస్తారు అనే విషయం పై చంద్రబాబు తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
అసలు పూర్తిగా భవిష్యత్తు లేకపోవడం వంటివి బాబుకు కాస్త కంగారు పుట్టిస్తున్నాయి.
ఇప్పటి నుంచే ఎవరిని అభ్యర్థిగా పోటీలోకి దింపాలి అనే విషయంపై చంద్రబాబు దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.ప్రస్తుతం పార్టీ భవిష్యత్తు గురించి ఆలోచించడం మానేసి, ఎప్పుడో జరగబోయే ఎన్నికలకు అభ్యర్థులను దించడం ఆలోచించడం అవసరమా అనే పెదవి విరుపులు సైతం ఇప్పుడు మొదలయ్యాయి.