అన్ లాక్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి.ధరలు పెరుగుతుండటంతో దీనిపై బులిటెన్ మార్కెట్ నిపుణులు స్పష్టతను ఇచ్చారు.
కరోనా విజృంభణ, వ్యాక్సిన్ అందుబాటు వంటి అంశాలపై ఇప్పటికీ అస్పష్టత ఉండటం వల్లే బంగారం ధరలు పెరుగుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెరుగుతున్న సవాళ్లు, బ్యాంకుల వైఖరి వంటి అంశాల ఆధారంగా బంగారం ధరలపై ప్రభావం చూపుతుందని నిపుణులు తెలుపుతున్నారు.
అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర జౌన్స్ 1900 డాలర్ల నుంచి 2000 డాలర్ల వరకు ఉందని, యూఎస్ ఫెడ్ పాలసీ కారణంగా ఇన్వెస్టర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నారన్నారు.ఇతర కరెన్సీలతో పోలిస్తే డాలర్ వ్యాల్యూ స్థిరంగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
కరోనా కేసులు తగ్గడం, మార్కెట్ లో కరోనా వ్యాక్సిన్ వచ్చేంతవరకూ ఈ ప్రభావం కొనసాగుతుందన్నారు.కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు కూడా ఆచితూచి అడుగేస్తున్నారని నిపుణులు పేర్కొన్నారు.గత నెల ఆగస్టు 7న 10 గ్రాముల బంగారం ధర రూ.56,200 పెరిగినా రికార్డు స్థాయిలో నమోదైన ధరతో పోల్చితే ఇప్పటికి రూ.4500 తక్కువగా ఉందన్నారు.చాలా రోజుల తర్వాత బంగారం ధరలు రూ.52,000కు దగ్గరగా చేరుకున్నాయని అంతర్జాతీయ బులియన్ మార్కెట్ నిపుణలు చెబుతున్నారు.