టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన రీసెంట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ విజయం సాధించడంతో, ఎంతో కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న పూరీ ఆశ నెరవేరింది.కాగా ఈ సినిమాతో ఆయన అందుకున్న సక్సెస్ జోష్‌తో తన నెక్ట్స్ మూవీని టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో తెరకెక్కిస్తున్నాడు.
ఫైటర్ అనే టైటిల్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్న పూరీ, ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ను ముంబైలో జరుపుతున్నాడు.కాగా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్‌లో ఈ కథ సాగుతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి.
అయితే లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడటంతో, చిత్ర యూనిట్ హైదరాబాద్ తిరిగి వచ్చేశారు.ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా పూరీ తెరకెక్కిస్తుండటంతో, ఫైటర్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
కాగా ఇటీవల ముంబైలో కూడా సినిమా షూటింగ్‌లు ప్రారంభిస్తున్నారు.దీంతో ఫైటర్ చిత్రం కూడా ముంబైలో షూటింగ్‌ను తిరిగి ప్రారంభిస్తుందని అందరూ అనుకున్నారు.కానీ ఇప్పటి వరకు పూరీ జగన్నాథ్, ఈ విషయంపై ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు.
దీంతో ఫైటర్ చిత్రం షూటింగ్ తిరిగి ఎప్పుడు, ఎక్కడ ప్రారంభం అవుతుందా అనే విషయం డైలమాలో పడింది.
ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సినిమాలో బాలీవుబ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తోండగా, ఛార్మీ ఈ సినిమాను పూరీతో కలిసి ప్రొడ్యూస్ చేస్తోంది.
అటు బాలీవుడ్‌లో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ రిలీజ్ చేయనుండటంతో ఫైటర్ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్‌లో నెలకొన్నాయి.మరి ఫైటర్ సైలెన్స్ ఎప్పుడు వీడుతాడో చూడాలి.