బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.తాజాగా సుశాంత్ మేనేజర్ శృతి మోదీ సీబీఐ విచారణకు హాజరై కీలక విషయాలను వెల్లడించింది.
నటి రియాకు కూడా గంజాయి అలవాటు ఉందని ఆమె పేర్కొంది.టెర్రస్ పై సుశాంత్, రియా గంజాయి పీల్చేవారని వారితో పాటు రియా సోదరుడు షోయక్, సుశాంత్ హౌజ్ కీపింగ్ మేనేజర్ కూడా గంజాయి పీల్చేవారని ఆమె వెల్లడించింది.
సుశాంత్ మృతి కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులకు వెలుగులోకి వస్తున్న కీలక విషయాలు షాక్ కు గురి చేస్తున్నాయి.అయితే గతంలో సీబీఐ అధికారులకు రియా తాను డ్రగ్స్ తీసుకోవడం లేదని చెప్పడం గమనార్హం.
ఒక జాతీయ మీడియాలో శృతి మోదీ చెప్పిన విషయాలు అంటూ రియా గంజాయి తీసుకునేదని కథనాలు ప్రచురితమయ్యాయి.కొన్ని రోజుల క్రితం రియా నిషేధిత డ్రగ్స్ గురించి చర్చించిన వాట్సాప్ చాట్ వైరల్ కాగా తాజాగా ఆమె డ్రగ్స్ తీసుకుంటోందని సుశాంత్ మేనేజర్ పేర్కొనడం గమనార్హం.
ఇప్పటికే డ్రగ్స్ వ్యవహారంలో అధికారులు ఒకరిని అరెస్ట్ చేశారు.రియా డ్రగ్స్ తీసుకుంటుందని తెలియడంతో గతంలో ఆమె చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. రియా సుశాంత్ కు గంజాయి అలవాటు ఉందని… కేదార్ నాథ్ సినిమా టైమ్ లో గంజాయి సుశాంత్ కు అలవాటైందని… సుశాంత్ మేనేజర్ శృతితో ఈ విషయం గురించి చర్చించానని… తనకు మాత్రం డ్రగ్స్ అలవాటు లేదని ఆమె చెప్పుకొచ్చారు.మరోవైపు నేడు రియా తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తి సీబీఐ విచారణకు హాజరయ్యారు.