బంగారు ప్రియులకు శుభవార్త: రోజురోజుకు భారీగా తగ్గుతున్న బంగారం ధర ...!

దేశీయ మార్కెట్ లో బంగారం ధర రోజురోజుకు తగ్గుతూ వస్తోంది.లాక్ డౌన్ లో ఆకాశాన్ని తాకిన ధరలు అన్ లాక్ ప్రక్రియ కొనసాగడంతో బంగారం ధరలు మెల్లిగా తగ్గతూ వస్తున్నాయి.

 Gold Rates Getting Decreased Day By Day, Gold Rates, Silver, Market, Stock Marke-TeluguStop.com

వెండి ధర కూడా పసిడి బాటలో నడుస్తోంది.

ఇక హైదరాబాద్ మార్కెట్ లో కూడా పసిడి ధర తగ్గుతూ వస్తోంది.బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.530 తగ్గడంతో ధర రూ.54,050కి చేరింది.10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.550 తగ్గడంతో రూ.49,480 కి చేరింది.గత కొద్ది రోజులుగా బంగారం ధర తగ్గుతూ వస్తోంది.దీంతో పసిడి ప్రియులకు శుభవార్తగా చెప్పుకోవచ్చు.దేశీయ మార్కెట్ లో పసిడి తగ్గడంతో వెండి కూడా పసిడి బాటలోనే అడుగేసింది.మార్కెట్ కేజీ వెండి ధర ఏకంగా రూ.1200 తగ్గడంతో ధర రూ.65,500 కు చేరింది.

ఇక భారతదేశ రాజధాని ఢిల్లీ మార్కెట్ లో కూడా పసిడి ధర తగ్గింది.24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.550 తగ్గడంతో ధర రూ.54,880కు చేరింది.10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.500 తగ్గడంతో రూ.50,260కు చేరింది.ఇక కేజీ వెండి ధర కూడా తగ్గింది.10 గ్రాముల వెండిధర రూ.665 తగ్గడంతో రూ.65,510 కు చేరింది.పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం వల్ల ధరలు పెరగుదల, తగ్గుదలకు కారణమవుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.

అమెరికా-చైనా ఉద్రిక్తతలు, కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల వల్ల పసిడి స్థిరంగా ఉండటానికి దోహదపడుతున్నాయని, బంగారం ధర స్థిరంగా ఉంటే వెండి ధర పెరుగుతోంది నిపుణులు పేర్కొంటున్నారు.మరోవైపు పెట్టుబడి దారులు కూడా అధిక లాభాలు ఆర్జించడం కారణంతో వాళ్లు మళ్లీ తిరిగి బంగారం వెండి పై ఇన్వెస్ట్ చేయడానికి సుముఖత చూపడం లేదు.

ప్రపంచ మార్కెట్లో వివిధ దేశాల్లో ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ సంబంధించి క్లినికల్ ట్రయల్స్ మూడో దశకు చేరుకోవడంతో మదుపరులు బంగారం వెండి పై ఆసక్తి చూపడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube