కరోనా పేరుతో వ్యాపారమా ? జగన్ సీరియస్ వార్నింగ్ ?

కరోనా వైరస్ విషయంలో ప్రజల్లో నెలకొన్న సందేహాలు, భయాలు పోలేదు.ప్రస్తుతం ఈ వైరస్ వ్యాధి తగ్గకపోగా, రోజు రోజుకి మరింతగా వివరిస్తూ వెళుతుండటం, నిబంధనలు పూర్తిగా ఎత్తివేయడంతో ఎక్కడికక్కడ కేసులు పెరిగిపోతూనే వస్తున్నాయి.

 Jagan Serious Warning On Private Covid Centers Fees Issue, Private Covid Centers-TeluguStop.com

కరోనా కట్టడికి ప్రభుత్వాలు సైతం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా, పరిస్థితి అదుపులోకి రావడం లేదు.ఇక ఈ వైరస్ సోకిన వారికి ప్రభుత్వం ప్రత్యేకంగా కొవిడ్ సెంటర్ లను ఏర్పాటు చేసి ట్రీట్మెంట్ అందిస్తోంది.

అయినా ప్రభుత్వం నిర్వహించే  కొవిడ్ సెంటర్లలో ఇచ్చే ట్రీట్మెంట్ పై ప్రజల్లో అనేక సందేహాలు ఉండడం, ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించుకుంటేనే తమ ఆరోగ్య పరిస్థితి మెరుగు పడుతుందనే అభిప్రాయం ఉండటంతో, కరోనా ప్రభావానికి గురైన వారు ఎక్కువ మంది ప్రైవేటు ఆసుపత్రుల వైపు మొగ్గు చూపిస్తున్నారు.

ఇదే కొన్ని ప్రైవేటు ఆస్పత్రులకు కాసులు కురిపించే అంశంగా మారింది.

కొన్ని ప్రైవేటు కొవిడ్ ఆసుపత్రుల్లో లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ, ప్రజలను పట్టి పీడిస్తుండడంతో కొద్దిరోజులుగా ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి.ఈ తరహా ఫిర్యాదులు పెరిగిపోతుండటంపై ఏపీ సీఎం జగన్ ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో మానవీయ కోణంలో వ్యవహరించాల్సిన ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రధానంగా కరోనా భయాన్ని చూపించి లక్షల్లో ఫీజులు వసూలు చేయడంపై సీరియస్ గా దృష్టి పెట్టారు.

ఇప్పటికే కలెక్టర్లు, ఎస్పీలకు ఈ తరహ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడంతో పాటు, ప్రైవేట్ ఆసుపత్రులపై నిఘా ఏర్పాటు చేసి, ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘించి వ్యవహరిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రుల పై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించినట్లు తెలుస్తోంది.

వాస్తవంగా కొవిడ్ కేర్ నిర్వహిస్తున్న ప్రైవేటు ఆసుపత్రులకు ఒక్కో పేషెంట్ కు ఫీజు నిమిత్తం 3500 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది.కానీ ప్రైవేట్ ఆస్పత్రులు ఎక్కడా ఆ నిబంధనలు పట్టించుకోకుండా, లక్షల్లో ఫీజులు వసూలు చేస్తుండటంతో, సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అయినా లెక్క చేయని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ వస్తుండడంపై ఇప్పుడు జగన్ ఆదేశాలతో అధికారులు సీరియస్ గా దృష్టి పెట్టారు.

Telugu Caronaap, Corona, Jaganprivate, Privatecovid, Ys Jagan-Telugu Political N

ఈ మేరకు ప్రత్యేకంగా కొవిడ్ కేర్ ఆస్పత్రి పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరిస్తున్న ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే రంగంలోకి దిగారట.వాస్తవంగా చెప్పుకుంటే, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఒకేరకమైన ట్రీట్మెంట్ ఉంటుంది.ప్రభుత్వ ,ప్రైవేటు ఆస్పత్రిలో రెండు చోట్ల విటమిన్ టాబ్లెట్లు, వేడినీళ్లు, పౌష్టికాహారం ఒకే విధంగా ఇస్తున్నారు.

ఇక అత్యవసరమైన పేషెంట్లకు అందించేందుకు ఆక్సిజన్ సిలిండర్, వెంటిలేటర్ సౌకర్యం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాయి.

అయినా మెజారిటీ జనాలు ప్రైవేట్ ఆస్పత్రుల పైనే ఎక్కువగా దృష్టి పెట్టడంతో, కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ, వ్యాపారం కోణంలో పేషెంట్లను ట్రీట్ చేస్తున్నాయి.

రేటు పెరిగే కొద్దీ, నాణ్యమైన వైద్య సేవలు అందుతాయనే అపోహలు జనాల్లో ఉండడంతో, అవి కాసులు రాల్చే కేంద్రాలుగా మారిపోయాయి.ప్రస్తుతం జగన్ ఆదేశాలతో అధికారులు ఈ తరహా ఆసుపత్రులపై నిఘా ఏర్పాటు చేశారు.

ఇప్పటికే కొన్ని కొన్ని ప్రవేటు ఆసుపత్రులను సైతం సీజ్ చేస్తూ దడ పుట్టిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube