కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా సినిమా రిలీజ్ లు, సినిమా షూటింగ్ లు అన్ని ఆగిపోయాయి.సినీ స్టార్స్ అందరూ కూడా ఇంట్లోనే ఉంటున్నారు.
ఇంకా ఇంటి ఫుడ్ తింటే ఎవరైనా సరే లావు అయిపోతారు.అందుకే ఫిట్ గా ఉండేందుకు ఇంట్లోనే యోగాలు జిమ్ లు చేస్తున్నారు.
ఆలా చేసిన సమయంలో కొందరు సినీ తారలు ఫోటోలను షేర్ చేస్తున్నారు.
అలా షేర్ చేసిన ఫోటోనే ప్రస్తుతం అందరిని తికమక పెడుతుంది.
ఓ హీరో వ్యాయామం చేస్తున్న ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.ఆ ఫోటో చుసిన ప్రతి ఒక్కరు ఎవరు ఆ హీరో అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరి మీకు అయినా ఆ హీరో ఎవరో తెలుస్తుందా? తెలిలేదా? అతనే అండి మాస్ మహారాజ్ రవితేజ.
పేస్ కనిపించకుండా వర్కౌట్ చేస్తున్న రవి తేజ ఫోటోను తీసుకొని నెట్టింట్లో ఈ హీరో ఎవరో కనుక్కోండి చూద్దాం అంటూ షేర్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.కాగా రవి తేజ ప్రస్తుతం గోపీచంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రాక్ సినిమాలో నటిస్తున్నారు.మరో సినిమాకు కూడా కమిట్ అయినట్టు ప్రచారం జరుగుతుంది.