వైరల్: కొడుకు పరీక్షా కోసం తండ్రి చేసిన సాహసం..!

మనం ఎలా ఉన్న మన పిల్లులు మంచి చదువులు చదివి బాగా బ్రతకాలి అని ప్రతి తల్లితండ్రులు కోరుకుంటారు.అలానే ఓ చదువులేని తండ్రి కూడా తన కొడుకుభవిష్యత్తు కోసం కలలుకన్నాడు.

 Father, Son, 105 Km Bicycle, Tenth Class Examination,madhya Pradesh,examination-TeluguStop.com

ఆ కలను సాకారం చేసేందుకు ఎవరు చేయలేనటువంటి పని చేసి వార్తల్లో నిలిచాడు.అసలు ఆ తండ్రి ఎం చేశాడు అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.

మధ్యప్రదేశ్‌లోని థార్‌ జిల్లాలోని తనవార్‌ తహసీల్‌లోని బేడీపూర్‌ అనే ఓ మారుమూల గ్రామంలో 38 ఏళ్ల శోభ్రామ్‌ అనే వ్యక్తికి చదువు విలువ బాగా తెలుసు.అందుకే తన కుమారుడు బాగా చదువుకోవాలనుకున్నాడు.

అయితే ఆ కుమారుడు మొదటిసారి పరీక్షలు రాసిన సమయంలో ఫెయిల్ అయ్యాడు.

అయితే ఆ సబ్జెక్టులను పూర్తి చేసేందుకు ”రుక్‌ జానా నహీ” అనే పథకాన్ని ప్రవేశపెట్టి థార్‌ జిల్లాలో నిర్వహించారు.

ఆ పరీక్ష కేంద్రం వారి గ్రామం నుంచి ఏకంగా 105 కి.మీ దూరంలో ఉంది.దీంతో కుమారున్ని అక్కడికి తీసుకెళ్లి పరీక్ష రాయించాలనుకున్నాడు.కానీ లాక్ డౌన్ కారణంగా బస్సులు, ఆటోలు లేవు.ద్విచక్ర వాహనం ఇచ్చే వారు లేరు.దీంతో అతను 105 కిలోమీటర్లు సైకిల్ పై కుమారున్ని తీసుకెళ్లినట్టు పరీక్ష ప్రారంభం అయ్యేసరికి అక్కడికి చేరుకున్నట్టు వారు తెలిపారు.

దాదాపు రెండు రోజులు సైకిల్ పై ప్రయాణం చేసినట్టు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube