ఏ ఇండస్ట్రీలో అయినా కానీ ఒక సినిమా హిట్ అవ్వాలన్నా, ప్లాప్ అవ్వాలన్నా అందుకు ముఖ్య కారణం ప్రేక్షకులే.ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే సినిమాలే దాదాపు హిట్ ను సొంతం చేసుకున్నాయి.
ఇక సినిమాలు చేసిన తర్వాత, అవి ప్లాప్ అయితే దర్శకులు వెనక్కి తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు.కానీ, ఏ సినిమా అయినా కానీ హిట్ కానీ, ప్లాప్ కానీ అయినా కూడా పట్టించుకోకుండా ముందుకు కొనసాగేలా దర్శకులు ఎందరో ఉన్నారు భారతదేశ చలన చిత్ర పరిశ్రమలో.
ఇక కొందరు దర్శకులు సినిమాను తీస్తే మాత్రం ప్రతిదీ కూడా హిట్ సొంతం చేసుకుంటారు.అలాంటి దర్శకులి ఎవరో చూద్దామా…
సినిమా ఫ్లాప్ అయినా లిస్టులో ఇప్పటి వరకు ఆ జాబితాలో లేని దర్శకుడు అనిల్ రావిపూడి.
ఈయన దర్శకత్వం లో సాయి ధర్మ తేజ్ తో కలిసి తీసిన సినిమా సుప్రీం… అనంతరం కళ్యాణ్ రామ్ తో కలిసి పటాస్, రాజా ది గ్రేట్ సినిమాలతో మంచి విజయం సొంతం చేసుకున్నాడు.ఇక ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయిన మహేష్ బాబు సినిమా సరిలేరు నీకెవ్వరు కూడా భారీ హిట్ ను సొంతం చేసుకున్నాడు.
ఇక ప్రస్తుతము ఉన్న డైరెక్టర్లలో అనిల్ రావిపూడి స్టైల్ చాలా డిఫరెంట్.
ఇక మన టాలీవుడ్ లో రాజమౌళి దర్శకుడు గా చేసిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తో మొదలయి బాహుబలి తో ప్రపంచం వ్యాప్తంగా అందరినీ ఆకట్టుకున్నాడు.ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ప్రతి సినిమా కూడా హిట్ టాక్ సొంతం చేసుకుంది.సింహాద్రి, చత్రపతి, మగధీర, ఈగ, విక్రమార్కుడు ఇలాంటి మంచి సినిమాలను తీసి ప్రేక్షకులను తనదైన స్టైల్ లో మెప్పించాడు.
ఇక అప్పట్లో మర్యాద రామన్న సినిమా రాజమౌళికి దెబ్బతీశాయని అనుకున్నారు.కానీ, ఆ సినిమా కూడా హిట్ సొంతం చేసుకుంది.టాలీవుడ్ జక్కన్న గా పిలిచే రాజమౌళి చేసిన ఒక్క సినిమా ప్లాప్ అవ్వలేదు.
రాజ్ కుమార్ హిరానీ… ఈయన బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫెయిల్యూర్స్ లేని నెంబర్ వన్ దర్శకుడు.బాలీవుడ్ ఇండస్ట్రీలో మున్నా భాయ్ ఎంబీబీస్ తోప్రారంభించి మూడు ఇలా ప్రతి సినిమా కూడా హిట్ సొంతం చేసుకున్నాడు.అలాగే తమిళ దర్శకుడి వెట్రిమారన్ కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు.
ఈయన ఎక్కువగా సామాజిక అంశాలపై సినిమాలను డైరెక్ట్ చేస్తూ ఉంటాడు.ఈ డైరెక్టర్ నాలుగు నేషనల్ అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు.
ఇక మన టాలీవుడ్ లో మరో దర్శకుడు కొరటాల శివ.ముందుగా ఇండస్ట్రీలో రైటర్ గా కొనసాగిన కొరటాల శివ ఇప్పుడు డైరెక్టర్ గా దూసుకెళ్లిపోతున్నాడు ఇండస్ట్రీలో.మిర్చి సినిమా అనంతరం డైరెక్టర్ గా మారిన కొరటాల శివ ఆ తర్వాత శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలతో మంచి హిట్ ను సొంతం చేసుకున్నాడు.ప్రస్తుతం ఇతను ఆచార్య సినిమా లో చిరంజీవి ని డైరెక్ట్ చేయబోతున్నాడు.