కరోనా వైరస్.ఎవరిని వదలడం లేదు.సీఎం అయినా పీఎం అయినా.పేదవాడు అయినా ఉన్నవాడు అయినా.సెలబ్రెటీ అయినా సామాన్యుడు అయినా జాగ్రత్తలు తీసుకోకుంటే కరోనా బారిన పడకతప్పదు.ఇంకా అలానే కేంద్ర మంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్ వచ్చింది.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కు కరోనా వచ్చి పోయింది.ఇప్పుడ కర్ణాటక సీఎంకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పకు కరోనా వైరస్ పాజిటివ్ నిర్దారణ అయ్యింది.ఇంకా ఈ విషయాన్నీ ఆయనే తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.అంతేకాదు తనని కలిసిన వారు అంత కూడా స్వీయ నిర్బంధంలో ఉండాలని సూచించారు.
ప్రస్తుతం యడ్యూరప్ప చికిత్స నిమిత్తం బెంగళూరులోని ఓల్డ్ ఎయిర్‌పోర్టు రోడ్‌లోని మణిపాల్ దవాఖానలో చేరారు.
కాగా కర్ణాటకలో కరోనా విజృంభణ దారుణంగా ఉంది.
రోజుకు వేలల్లో కేసులు నమోదవుతున్నాయి.ఇప్పటివరకు కర్ణాటకలో 1.34 లక్షల కేసులు పాజిటివ్‌గా నమోదవ్వగా మృతుల సంఖ్య 2,496కు చేరింది.కాగా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తర్వాత దేశంలో వైరస్ పాజిటివ్‌గా వచ్చింది రెండో సీఎం యడ్యూరప్పకే.
నిన్న కేంద్ర హోమ్ మంత్రి అమితాషాకు కరోనా వైరస్ పాజిటివ్ నిర్దారణ అయినా సంగతి తెలిసిందే.