స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి ఏడాది ఆయన ఘాట్ దగ్గరకి వెళ్లి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లి నివాళి అర్పిస్తూ ఉంటారు.తాతగారు అంటే అమితమైన అభిమానం చూపించే జూనియర్ ఎన్టీఆర్ కూడా జయంతి రోజు కచ్చితంగా ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి నివాళి అర్పిస్తూ ఉంటారు.
అయితే మొదటి సారి ఎన్టీఆర్ ఘాట్ కి తారక్ వెళ్ళకూడదని నిర్ణయం తీసుకున్నాడు. లాక్ డౌన్ కారణంగానే అని తెలుస్తుంది.
మళ్ళీ తాను వెళ్తే అభిమానులు పెద్ద సంఖ్జ్యలో వచ్చే అవకాశం ఉన్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్ళలేకపోయిన తారక్ తన తాత జయంతిని స్మరించుకున్నారు.
తాతగారిపై ఎమోషనల్ గా తారక్ ఒక ట్వీట్ కూడా చేశారు.
సోషల్ మీడియా వేదికగా తాతపై తనకున్న ప్రేమను చాటుతూ తారక్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.
నీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతుంది.మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లి పోతుంది.
పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాత మీరు లేని లోటు తీరనిది అంటూ తారక్ ట్వీట్ చేసారు. సీనియర్ ఎన్టీఆర్ మీద తారక్ కి ఎంత అభిమానం, ప్రేమ ఉన్నాయి అనేది ఈ వాఖ్యల బట్టి అర్ధమవుతుంది.
ఇక తారక్ కూడా నటనలో ఒక్కో మెట్టు ఎక్కి ఈ రోజు తాతకి తగ్గ మనవడు అని, ఆయన రాజకీయానికి భవిష్యత్తు వారసుడు అనే గౌరవం అందుకుంటున్నాడు.తాతగారి వారసత్వాన్ని తారక్ ముందుకు తీసుకెళ్ళే క్రమంలో టీడీపీ పార్టీకి అధ్యక్షుడుగా మారాలని తెలుగు దేశం కార్యకర్తలు కూడా బలంగా కోరుకుంటున్నారు.
మరి నట వారసత్వం తీసుకున్న తారక్ రాజకీయ వారసత్వం కూడా తీసుకుంటాడెమో ఎదురుచూడాలి.