అన్ని కోట్ల ఆస్తి ఉన్నా కూడా ఆ యాంకర్ మాత్రం చాలా సింపుల్ గా ఉంటాడట...

తెలుగులో మేల్ యాంకర్లలో మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి వారిలో హీరో మరియు యాంకర్ రవి ఒకడు.అయితే యాంకర్ రవి ఒకపక్క పలురకాల షోలు ఈవెంట్లలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూనే మరోపక్క చిత్రాల్లో కూడా అడపాదడపా పాత్రలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను బాగానే అలరిస్తున్నాడు.

 Anchor Ravi, Tollywood Anchor, Patas, Adirindi, Property-TeluguStop.com

అయితే తాజాగా యాంకర్ రవి ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.ఇందులో భాగంగా పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

అయితే ఇందులో ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మీకు అన్ని కోట్ల రూపాయల ఆస్తి ఉన్నప్పటికీ ఇంత సింపుల్ గా ఉండటానికి కారణం ఏంటని అడగ్గా యాంకర్ రవి స్పందిస్తూ తనకు ఎంత డబ్బు, ఆస్తి ఉన్నప్పటికీ చాలా సింపుల్ గా ఉండడమే ఇష్టమని చెప్పుకొచ్చాడు.అంతేకాక కోట్ల రూపాయల ఖరీదైన కార్లు, బంగ్లాలు వంటి వాటిపై తనకి మోజు లేదని తనకు ఎప్పుడూ కూడా తనకి ఉన్నంతలో మరియు ఉన్నవాటితో సర్దుకుపోవడమే ఇష్టమని తెలిపాడు.

అలాగే తన కూతురు భవిష్యత్తు కోసం మంచి విద్య అందించి ఆమెకు ఒక చక్కని జీవితాన్ని అందిస్తే తనకు అదే సంతృప్తి అని కూడా తెలిపాడు.దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అలాగే పలువురు నెటిజన్లు ప్రస్తుత కాలంలో 50 లేదా లక్ష రూపాయలు జీతం రాగానే కార్లు, బంగ్లాలు అంటూ తెగ జల్సా చేసే ఈ రోజుల్లో అన్ని కోట్ల రూపాయలు ఆస్తి ఉన్నప్పటికీ చాలా సింపుల్గా ఉండేటువంటి రవి ని చూసి రవి  డబ్బులున్న  నిరాడంబరుడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం యాంకర్ రవి టాలీవుడ్ ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయినటువంటి ఈ టీవీ ప్లస్ ఛానల్ లో ప్రసారమయ్యేటువంటి పటాస్ షో కి యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు.

అలాగే జీ తెలుగు ఛానల్ లో ప్రసారమయ్యేటువంటి అదిరింది షోలో కూడా యాంకర్ గా వ్యవహరిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube