కేటీఆర్ సూపరంతే ఎందుకంటే ఇందుకే ?

తండ్రికి తగ్గ తనయుడిగా తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ ప్రతి సందర్భంలో తనను తాను నిరూపించుకుంటున్నారు.కేవలం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు గానే కాకుండా, వ్యక్తిగతంగా తన పలుకుబడి పెంచుకునే విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు.

 Ktr, Twitter, Ktr Tweets, Vijayawada, Noc, Migrants,cm Kcr Son-TeluguStop.com

ప్రస్తుతం మంత్రిగా ఉన్న కేటీఆర్ త్వరలో సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.అయితే కేటీఆర్ సీఎం పదవికి నూటికి నూరుపాళ్ళు అర్హుడు అనే విషయం ప్రజల నుంచి ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది.

దానికి తగ్గట్టుగానే కేటీఆర్ వ్యవహారాలు ఉంటున్నాయి.మొదటి నుంచి సోషల్ మీడియా లో కేటీఆర్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు.

ట్విట్టర్ వేదికగా ఆయన ప్రతి విషయం పైన స్పందిస్తూ ఉంటారు.

ప్రజా సమస్యల విషయంలో ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, అధికారులను అప్రమత్తం చేస్తూ ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ఉంటారు.

ప్రస్తుతం కరోనా సమయంలోనూ కేటీఆర్ అదే విధంగా వ్యవహరిస్తున్నారు.ప్రత్యక్షంగా ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కార మార్గాలు వెదుకుతూనే, వందలాదిమంది అవసరాలను తీరుస్తూ కేటీఆర్ అండగా నిలబడుతున్నారు.

తన సహాయం కోరుతూ ఎవరైనా ట్వీట్ చేస్తే వెంటనే వారికి సమాధానం ఇస్తూ, వారి సమస్యలను పరిష్కరించే దిశగా కేటీఆర్ అడుగులు వేస్తున్నారు.దీంతో కేటీఆర్ పై తెలంగాణ ప్రజల నుంచే కాకుండా, దేశ విదేశాల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి.

కేటీఆర్ ట్విట్టర్ ఖాతా కు నిత్యం అనేక విజ్ఞప్తులు వస్తూనే ఉంటాయి.అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా ఆ సమస్యల పరిష్కారానికి కేటీఆర్ ఎప్పుడు చొరవ తీసుకుంటూనే వస్తున్నారు.

దీనికోసం ప్రత్యేకంగా కేటీఆర్ కు ఓ టీమ్ పని చేస్తోంది.ప్రస్తుతం కరోనా సమయంలోనూ ఈ విజ్ఞప్తులు మరిన్ని వస్తూనే ఉన్నాయి.

చంటి బిడ్డకు పాలు ప్యాకెట్ పంపాలని ఓ తండ్రి, తెలంగాణ లో చిక్కుకున్న తమ రాష్ట్రాలకు చెందిన కార్మికులకు సహాయం అందించాలని పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దగ్గర నుంచి కేటీఆర్ కు విజ్ఞప్తులు చేస్తూ ఉండడం వారికి వెంటనే కేటీఆర్ పరిష్కార మార్గాలు చూపిస్తుండడం నిత్యకృత్యంగా మారాయి.

Telugu Cm Kcr Son, Ktr Tweets, Vijayawada-Telugu Political News

కొద్ది రోజుల క్రితం న్యూజిలాండ్ నుంచి ఓ వ్యక్తి కేటీఆర్ ట్వీట్ చేశారు.విజయవాడలో ఉన్న తన తల్లికి బైపాస్ సర్జరీ చేయాల్సి ఉందని, ఆమెకు ఎన్ఓసి ఇప్పించాలని కోరారు.దీనికి కేటీఆర్ భరోసా ఇస్తూ తన టీం కు ఆ ట్వీట్ ను టాగ్ చేశారు.

వెంటనే ఆ మహిళ విజయవాడ నుంచి హైదరాబాద్ కు వచ్చేందుకు వీలుగా ఎన్ ఓ సి లభించింది.నిజామాబాదు లో చిక్కుకున్న తమిళనాడుకు చెందిన వారిని ఆదుకోవాలంటూ డీఎంకే అధినేత స్టాలిన్ ట్వీట్ చేయగా కేటీఆర్ స్పందించి బాధితులకు నిత్యావసరాలు అందించారు.

తెలంగాణ ప్రాంతంలోని ఓ గర్భిణీ కేటీఆర్ ట్వీట్ చేసింది.హెల్త్ చెకప్ చేసుకోవాలని , లాక్ డౌన్ కారణంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని, సహాయం చేయాలని కోరగా, ఆమెకు వైద్య పరీక్షలు చేయించే ఏర్పాటును కేటీఆర్ చేశారు.

ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రతి సందర్భంలో కేటీఆర్ సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తూ ఉండటంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube