మామూలుగా ఎక్కడైనా మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళకి కూడా సమాన హక్కులు కావాలని పోరాడుతున్న ఘటనలు మనం తరచూ చూస్తుంటాం.కానీ అక్కడ మాత్రం అసలు మగవాళ్ళని తమ హోటల్ లోకి అనుమతించకూడదని కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశించాలని ఏకంగా మహిళల కోసం సపరేటు హోటల్ నిర్మించారు.
ఇంతకీ ఆ హోటల్ ఎక్కడ ఉంది అంటే స్పెయిన్ దేశం లోని బాలేరియక్ దీవిలో ఉంది.ఈ హోటల్ లో కి కేవలం ఆడవాళ్ళకు మాత్రమే ప్రవేశం ఉంటుంది.
వివరాల్లోకి వెళితే స్పెయిన్ దేశానికి చెందినటువంటి బాలెరియక్ దీవిలో “సోమ్ డోనా”అనే హోటల్ ఉంది.అయితే ఇందులో ప్రత్యేకత ఏముందని అనుకుంటున్నారా…? ఈ హోటల్ లోకి 14 సంవత్సరాలు నిండినటువంటి ఆడవాళ్ళకు మాత్రమే అనుమతి ఉంటుంది.అంతేగాక ఈ హోటల్ లో పని చేసేటువంటి చాలా మంది సిబ్బంది కూడా ఆడవాళ్ళ మాత్రమే ఉంటారు.అంతేకాకుండా పలువురు సెక్యూరిటీ సిబ్బంది కూడా మహిళల భద్రత కోసం నిత్యం గస్తీ చేపడుతుంటారు.
అయితే ప్రశాంతంగా మగవాళ్ళు లేకుండా గడపాలనుకునే ఆడవాళ్ళకి ఈ ప్రదేశం ఎంతో ప్రత్యేకమని హోటల్ నిర్వాహకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఇప్పటి వరకు ఇలాంటి హోటల్ ఉండడం చాలా అరుదు.
దీంతో పలువురు పర్యాటకులు ఈ హోటల్ లో బస చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.అంతేగాక ఈ దీవికి పర్యాటకులు నిమిత్తమై వచ్చేటువంటి వారి కోసం హోటల్ నిర్వాహకులు ప్రత్యేక ప్యాకేజీలను కూడా అందుబాటులోకి తెచ్చారు.
కానీ హోటల్లోకి మాత్రం కేవలం ఆడవాళ్ళకు మాత్రమే అనుమతి ఉంటుంది.అయితే ఇతర మగవాళ్ళని మాత్రం కనీసం హోటల్ దరిదాపుల్లోకి కూడా నిర్వాహకులు రానివ్వరు.