బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ ఇటీవల కాలంలో కరోనా వైరస్ బారిన పడిన సంగతి అందరికీ తెలిసిందే.దీంతో ఈ అమ్మడు కరోనా వైరస్ కి చికిత్స తీసుకునేందుకుగాను వైద్యుల పర్యవేక్షణలో దాదాపుగా 21 రోజులపాటు సెల్ఫ్ కక్వారెంటైన్ లో ఉంది.
దీంతో కనికా కపూర్ అభిమానులు ఆమెను తొందరగా కరోనా వైరస్ నుంచి కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థించారు.
అయితే తాజాగా సింగర్ కనికా కపూర్ తన ఆరోగ్య పరిస్థితి గురించి సోషల్ మీడియా మాధ్యమంలో ఓ పోస్ట్ ని షేర్ చేసింది.
ఇందులో భాగంగా తాను ప్రస్తుతం కరోనా వైరస్ బారినుంచి పూర్తిగా కోలుకున్నానని అందువల్ల ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యానని కూడా తెలిపింది.అంతేగాక ప్రస్తుతం తన కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకుంది.
అలాగే కరోనా వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను కూడా ఈ అమ్మడు తెలిపింది.ఇందులో భాగంగా తరచూ చేతులను ఆల్కహాలిక్ సానిటైజర్స్ తో శుభ్రంగా కడుక్కోవాలని, సామాజిక దూరం పాటించాలని పేర్కొంది.
అయితే డిశ్చార్జ్ అయిన అనంతరం కొంతకాలం పాటు తనకి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని అందువల్లనే ప్రస్తుతం ఇంటిపట్టునే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నానని తెలిపింది.దీనికి తోడు ప్రస్తుతం ఎటువంటి షూటింగ్ లు లేకపోవడంతో తన కుటుంబ సభ్యులతో గడిపేందుకు సమయం దొరికిందని చెప్పుకొచ్చింది.
అయితే గతంలో తనపై కరోనా విషయంలో వచినటువంటి వార్తల్లో ఎటువంటి నిజం లేదని కొందరు కావాలనే ఇలాంటి వదంతులు పుట్టిస్తూ తన గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని కనికా కపూర్ వాపోయింది.