టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ప్రేక్షకులను తన మ్యూజిక్‌తో అలరిస్తూ వరుసగా హిట్ సినిమాలతో తన సత్తా చాటాడు.అయితే కొంతకాలంగా సరైన హిట్స్ లేకపోవడం, థమన్ లాంటి ఇతర మ్యూజిక్ డైరెక్టర్స్ గట్టి పోటీ ఇస్తుండటంతో దేవిశ్రీ కాస్త వెనకబడ్డాడు.
అయితే మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రంతో మళ్లీ కమ్‌బ్యాక్ ఇచ్చాడు దేవిశ్రీ ప్రసాద్.
కాగా మహర్షి సినిమా దేవిశ్రీ ప్రసాద్‌కు మరో బంపరాఫర్‌ను తీసుకొచ్చి పెట్టిందట.
మహర్షి సినిమాలో మంచి మ్యూజిక్ అందించడంతో దేవిశ్రీ ప్రసాద్‌ను బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన నెక్ట్స్ మూవీకి సంగీతం అందించాల్సిందిగా కోరాడట.సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ‘రాధే’ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాలో రెండు పాటలు అందించేందుకు దేవిశ్రీ ప్రసాద్‌ను సెలెక్ట్ చేశారట.
మహర్షి సినిమాలోని ‘చోటీ చోటీ బాతే’ అనే పాటకు సల్మాన్ ఫిదా అయినట్లు తెలుస్తోంది.
దీంతో దేవిశ్రీకి ఈ అవకాశం ఇచ్చాడట సల్మాన్.
గతంలోనూ సల్మాన్ ఖాన్ నటించిన రెడీ సినిమాలో ‘ఢింక చిక’ అనే పాటకు సంగీతం అందించిన విషయం తెలిసిందే.ఇప్పుడు రాధే కోసం ఎలాంటి మ్యూజిక్ అందిస్తాడో చూడాలి.