రోజా దగ్గరికి దొరబాబు పంచాయితీ.... మరి ఎలాంటి తీర్పు చెబుతుందో...

తాజాగా తెలుగు ఈటీవీ ఛానల్ లో ప్రతి గురు, శుక్ర వారాల్లో రాత్రి 9.30 నిమిషాలకు  ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోలో పని చేస్తున్నటువంటి ఇద్దరు కమెడియన్లు దొరబాబు, పరదేశి ఇటీవలే విశాఖ పట్టణంలోని ఓ అపార్ట్ మెంట్ లో వ్యభిచారం నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఈ విషయం గురించి పలు వార్తలు నెట్టింట్లో భాగానే వైరల్ అవుతున్నాయి.

 Will Dorababu Participating In Roja Bathuku Jataka Bandi Show-TeluguStop.com

జబర్దస్త్ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్నటువంటి సీనియర్ నటి రోజా జీ తెలుగు ఛానల్ లో ప్రసారమయ్యే బతుకు జట్కబండి అనే కార్యక్రమంలో కూడా జడ్జిగా వ్యవహరిస్తోంది.

అయితే తాజాగా దొరబాబు వ్యభిచారం కేసులో పోలీసులకు పట్టుబడడంతో దొరబాబు మీడియా ముందుకు రావడమే మానేశారు.దీంతో ఇప్పటికీ కొందరికి ఖచ్చితమైన నిజాలు ఏమిటనేది తెలియదు.దీంతో ఎవరికి వారు నచ్చినట్లు పలు కథనాలను అల్లేస్తున్నారు.ఇటీవల కాలంలో ఈ కథనాలు మరింత ఎక్కువ అవుతుండటంతో జబర్దస్త్ జడ్జి రోజా దొరబాబు ని బ్రతుకు బతుకు జట్కా బండి కార్యక్రమానికి పిలిపించి నిజానిజాలు ఏంటనేది ప్రజలకు తెలిసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

మరోపక్క ఈ కార్యక్రమానికి దొరబాబు కాకుండా అతడి భార్యను పిలిస్తే బాగుంటుందని ఇప్పటికే నిర్వాహకులు రోజా కి సూచించినట్లు తెలుస్తోంది.

Telugu Bathukujataka, Dorababu, Nandinireddy, Rojadorababu, Dorababuroja-Movie

దీంతో తొందర్లోనే దొరబాబు బ్రతుకు జట్కాబండి కార్యక్రమానికి వచ్చి నిజం ఏంటనేది చెప్పబోతున్నట్లు సమాచారం.అయితే ఈ విషయం ఇలా ఉండగా  జబర్దస్త్ షోలో కమెడియన్ దొరబాబు మళ్లీ కనిపిస్తున్నాడు.అయితే ఇందుకుగాను హైపర్ ఆది దొరబాబుకి బాగానే సపోర్ట్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే మొదట్లో జబర్దస్త్ నిర్వాహకులు దొరబాబుని షో నుంచి తొలగించాలని సూచించిన హైపర్ ఆది దొరబాబుకి అండగా నిలుస్తూ సర్దిచెప్పడంతో మళ్లీ అతడిని కొనసాగించినట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube