దెయ్యం… ఈ పేరు వింటే చాలు కొందరు గజగజా వణికిపోతారు.మరికొందరు మాత్రం దెయ్యాలు ఏమీ ఉండవని అవి ఎవరో సృష్టించిన కట్టుకథలని నమ్ముతారు.
కానీ మన దేశంలోని ఆ గ్రామం మాత్రం దెయ్యాల నిలయంగా పేరు తెచ్చుకుంది.ఎంత ధైర్యం ఉన్న వ్యక్తులకైనా ఆ గ్రామంలో అడుగుపెడితే చాలు గుండెలో భయం, శరీరంలో వణుకు మొదలవుతుంది.
ఆ గ్రామంలో దెయ్యాల దెబ్బకు రాత్రికి రాత్రే ఊరు ఖాళీ అయింది.
రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మీర్ జిల్లాలోని కుల్ ధార అనే గ్రామంలో రాత్రి అయిందంటే చాలు ఏవో వింత శబ్దాలు వినిపిస్తాయి.
ఆ శబ్దాలు వింటే ఎంత ధైర్యం ఉన్న వ్యక్తికయినా వెన్నులో వణుకు పుట్టాల్సిందే.అక్కడి స్థానికులు దెయ్యాల గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు.రాత్రి సమయంలో ఏవేవో వింత అరుపులు వినిపిస్తాయని, ఆ గ్రామంలో ఆత్మలు సంచరిస్తాయని చెబుతారు.
ఇండియన్ పరనార్మల్ సొసైటీ సభ్యులలో ఒకరైన గౌరవ్ తివారీ అనే వ్యక్తి ఈ గ్రామంలో పర్యటించి అక్కడ దెయ్యాలు ఉన్నాయని చెప్పడం గమనార్హం.
ప్రస్తుతం ఆ గ్రామంలో ఎవరూ నివశించడం లేదు.ఈ గ్రామం ఇలా కావడానికి కారణాలేంటనే ప్రశ్నకు ఒక్కొక్కరు ఒక్కో కారణం చెబుతున్నారు.ఇది దెయ్యాల నగరంగా పేరు తెచ్చుకోవడంతో ఈ గ్రామనికి పర్యాటకుల తాకిడి పెరిగింది.జైపూర్ నుంచి 587 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది.
ఈ గ్రామానికి వెళితే పురాతన కాలం నాటి ఇళ్ల నిర్మాణ శైలి, మొండి గోడలు, చెక్కు చెదరని ఆలయాలను చూడవచ్చు.