డౌట్‌గానే వస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ వరల్డ్ ఫేమస్ లవర్ మరికొన్ని గంటల్లో రిలీజ్‌కు రెడీ అయ్యింది.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు విజయ్ రెడీ అయ్యాడు.

 Vijay Devarakonda Unsure Of World Famous Lover Sucess-TeluguStop.com

ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో అర్జున్ రెడ్డి సినిమాను గుర్తుకు చేయడం ఖాయమని దేవరకొండ ఫ్యాన్స్ అంటున్నారు.

అయితే ఈ సినిమాపై విజయ్‌కు నమ్మకం లేదా అంటే, లేదనే అనిపిస్తుంది.

ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసిన ఆయన, చిత్ర ప్రమోషన్స్‌లో అంతగా పాల్గొనలేదు.చిత్ర ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకు మనోడు ఈ సినిమా గురించి నోరు విప్పి మాట్లాడలేదు.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఇటీవల జాయిన్ అయిన హీరో, ఇలాంటి లవ్ స్టోరీలను తాను ఇకపై చేయబోనని కుండ బద్దలు కొట్టి చెప్పాడు.అంతేగాక ఆయన ఇచ్చిన పలు ఇంటర్వ్యూల్లో కూడా తన నెక్ట్స్ ప్రాజెక్టుల గురించే ఎక్కువ మాట్లాడాడు.

అంటే ఈ సినిమా గురించి మనోడికి పెద్దగా నమ్మకం లేదనే అంటున్నారు సినీ విమర్శకులు.ఇక ఈ సినిమాను క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేస్తుండగా రాశిఖన్నా, కేథరిన్ త్రేసా, ఐశ్వర్యా రాజేష్, ఇసాబెల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube