తమిళంలో సూపర్ హిట్ అయిన 96కి రీమేక్ గా తెలుగులో జాను టైటిల్ తో దిల్ రాజు బ్యానర్ లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.శర్వానంద్, సమంత హీరో, హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తుంది.
ఫీల్ గుడ్ లవ్ స్టొరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా స్కూల్ బ్యాక్ డ్రాప్ ప్రేమికులు విడిపోయి ఎవరిదారిలో వారు వెళ్ళిపోయినా తర్వాత మరల గెట్ టుగెదర్ ద్వారా కలుసుకొని వారి జ్ఞాపకాలని ఎలా ఒకరితో ఒకరు పంచుకున్నారు అనే ఎలిమెంట్ తో ఎమోషనల్ గా ఉండబోతుంది.ఇప్పటికే తమిళ, మలయాళీ భాషలలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ప్రేమికుల రోజు సందర్భంగా పిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ప్రేక్షకుల ముందుకి వచ్చి సినిమా మీద పోజిటివ్ ఫీలింగ్ కలిగేలా చేసింది.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి ప్రేమికుల మధ్య ఉండే ఎమోషన్స్ ని ఎలివేట్ చేసే విధంగా ఫీల్ గుడ్ మెలోడీగా సాగే ప్రాణం… నా ప్రాణం అంటూ సాగే సాంగ్ ఆన్ లైన్ లో ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
ఈ మధ్య కాలంలో ప్రేమికులు పాడుకునే విధంగా ప్రేమలో భావోద్వేగాలు స్పృశించే విధంగా ఉన్న ఈ సాంగ్ సినిమా ఎలా ఉండబోతుందో అనేది చెబుతుంది.తమిళ మాతృకని దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.
ఇక ఈ సినిమాకి సంగీతం కూడా మాతృకకి సంగీతం అందించిన గోవింద్ వసంత ఫీల్ గుడ్ మ్యూజిక్ అందించారు.ఈ పాటని శ్రీమణి లెరిక్స్ అందించగా చిన్మయి, గౌతమ్ భరద్వాజ్ ఆలపించారు.